Take a fresh look at your lifestyle.

పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడండి

‌గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి, ఆదాయ పెంపుకు కృషిచేయాలని మహబూబాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌వీపీ గౌతమ్‌ ‌ప్రజలకు సూచించారు. జూన్‌ 1‌నుండి 8 వరకు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేకపారిశుద్ధ్య కార్యక్రమం లో భాగంగా గురువారం మండల కేంద్రమైన నెల్లికుదురు గ్రామంలోని కార్యాలయాలతో పాటు డంపింగ్‌ ‌యార్డు, ఆర్‌ అం‌డ్‌ ‌బి అతిథి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించి గ్రామంలో గంటన్నరపాటు కలియతిరిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ అం‌డ్‌ ‌బి అతిథి గృహాన్ని ఉపయోగంలోకి తేవాలని , షాపింగ్‌ ‌కాంప్లెక్స్ ‌నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సర్పంచ్‌ ‌సూచించారు.

పారిశుద్ధ్య కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ అభివృద్ధి పనుల పరిశీలన కోసం డ్రోన్‌ ‌కెమెరా అందిస్తామని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామ అభివృద్ధిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో స్థానిక సర్పంచ్‌ ‌బిరవెల్లి యాదగిరి రెడ్డి. ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్‌ ‌రావు, డ్వామా పిడి విద్యా చందన , తాహసీల్దార్‌ ‌రమేష్‌, ఎం‌పీడీవో వేణుగోపాల్‌ ‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులుతదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!