Take a fresh look at your lifestyle.

కొరోనాతో బిజెపి ఎంపి అశోక్‌ ‌గస్తీ మృతి

కొరోనా మహమ్మారి మరో ఎంపిని  బలితీసుకుంది. ఒక్క  రోజు తేడాలోనే ఇద్దరు ఎంపిలు మరణించడం కలకలం రేపుతోంది. బుధవారం తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు మృతి చెందారు. కర్నాటకు చెందిన భారతీయ జనతా పార్టీని ఎంపీని అది బలి తీసుకుంది. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్‌ ‌గస్తీ(55) కరోనాతో కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు నెలల క్రితమే అశోక్‌ ‌గస్తీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

అశోక్‌ ‌గస్తీ మృతిపట్ల కర్ణాటక బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. ఈ ఏడాది జులై 22న రాజ్యసభ ఎంపీగా అశోక్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. అయితే సెప్టెంబర్‌ 2‌వ తేదీన ఆయనకు కొరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ కావడంతో.. చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరారు. శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్‌ ‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేదు. అశోక్‌ 18 ఏళ్ల వయసులోనే బీజేపీ యువ మోర్చాలో చేరారు. 2012లో బీసీ కమిషన్‌ ‌చైర్మన్‌గా సేవలందించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply