Take a fresh look at your lifestyle.

రెగ్యులర్‌ ‌మండల విద్యాధికారి పోస్టులను భర్తీ చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మండలాల లో రెగ్యులర్‌ ‌మండల విద్యాధికారి పోస్టులు సుమారు పది సంవస్త్సరాల నుండి భర్తీ చేయక పోవడం మూలాన ప్రాధమిక విద్య పర్యవేక్షణ కొరవడి గాడి తప్పు తుంది అనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.ఆయా మండలాల లోని సీనియర్‌ ‌గెజిటెడ్‌ ‌హెచ్‌.‌యం కే అదనంగా యం.ఈ.ఓ భాధ్యతలు అప్పగించడం జరిగినది.కొన్ని జిల్లాలలో ఒక్కో మండల విద్యాధికారి ఆరు నుండి ఏడు మండలాలకి ఇన్ఛార్జి గా వ్యవహరించడం లాంటి సందర్భాలు కూడ వున్నాయి.నిత్యం రాష్ట్ర స్థాయి నుండి పాటశాల విద్యా శాఖ ద్వార జూం సమావేశాలు,నిరంతరం మండలము లోని టీచర్ల తో జూం సమావేశాలు,ఫోనులొ మాట్లాడటం వల్ల మానసికముగా కృంగి పోతూ వున్నారు.ఎక్కువగా మాట్లాడటం వల్ల మెదడు మిగతా అవయవాల మీద ప్రభావం చూపుతుంది.ఆదివారం,సెలవు దినాల లో కూడ కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు గడిపే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు.బి.పి,షుగర్‌ ‌లాంటి రోగాలు కూడ కొని తెచ్చుకుంటువున్నారు.

తెలంగాన రాష్ట్రంలో 555 మంది ఎంఈవోలు ఉండాల్సి ఉండగా 530కు పైగా ఖాళీలు ఉన్నాయి.సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉమ్మడి సర్వీస్‌ ‌రూల్స్ ‌విషయంలో దశాబ్దాల తరబడి కోర్టు కేసులు కొనసాగుతుండటంతో పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయడం లేదు.ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఉపాధ్యాయులను పర్యవేక్షిస్తూ విద్యారంగాన్ని గాడిలో పెట్టాల్సిన మండల విద్యాధికారుల పోస్టులకు(ఎంఈవో) ఏళ్లకు ఏళ్లుగా ఇన్‌ఛార్జిలే పని చేస్తూ వున్నారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే మండలాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించే పాఠశాల ఒక చోట ఉండగా మండలంతో పాటు మరో ఆరు,యేడు మండలాలకు ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా పనిచేస్తున్నారు.వీరుపర్యవేక్షణకు కాకుండ సమావేశాల హాజరుకే పరిమితం అవుతున్నారు. జిల్లా రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుండి ప్రతిరోజు ఏదో ఒక రకమైన డేటానింపి వాటికి సంతకం పెట్టడానికే సమయం సరిపోవడం లేదు.అటు బడిని, పనిచేస్తున్న మండలాన్ని పర్యవేక్షించడమే కస్టమయిన ఈ కాలం లో ఇతర మండలాలకు కూడా వారికి ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు.

ఫలితంగా ప్రధానోపాధ్యాయుడి విధులు, ఇన్‌ఛార్జి ఎంఈవో విధులకు పూర్తి న్యాయం జరగని పరిస్థితి దాపురించింది. పాఠశాలలపై పర్యవేక్షణ ప్రహసనంగా మారి పాఠశాలల విద్యారంగం అధోగతి పాలవుతూ వున్నా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విద్యాశాఖ అధికారులను నియమించడంపై, కోర్టు కేసులు పరిష్కరించడం పై తగిన శ్రద్ధ వహించక పోవడం సమంజసం కాదు.ప్రధానోపాధ్యాయుడిగా..వివిధ మండలాలకు ఇన్‌ఛార్జి ఎంఈవోగా బాధ్యతలను నిర్వహిస్తున్న వారికి ఈ విధులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ప్రధానోపాధ్యాయుడిగా మరో పాఠశాలకు బదిలీ అయినా ఇన్‌ఛార్జిగా ఎంఈఓ బాధ్యతలు మాత్రం తప్పడం లేదు.పాఠశాలల నిర్వహణకు, మండలాల పర్యవేక్షణకు వారు దేనికి న్యాయం చేయలేని పరిస్థితిలో నిలుస్తున్నారు.

హరిత హారం,నిష్టా సమావేశాలు, పాట్య పుస్తకాలు,దుస్తులు,సిస్‌ ‌యాప్‌, ‌విద్యాశాఖ అడిగే సమాచార సేకరణ, సమావేశాలు, శిక్షణలు వంటి కార్యక్రమాలకి సమయం సరిపోవడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో మరియు కోర్టుల సహకారంతో సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించి అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి భర్తీ చేస్తేతప్ప ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశంలేదు.వేసవి సెలవుల్లో బదిలీలు,పదోన్నతులు నిర్వహిస్థామని ప్రభుత్వం మాట ఇచ్చింది.ఆన్లైన్‌ ‌తరగతులు ప్రారంభం అయి నెల దాటింది.ఇప్పటికి బదిలీలు,ప్రమోషన్ల ఊసు లేదు.ఇప్పటికయిన ప్రభుత్వం,విద్యాశాఖ దృష్టి సారించి ఏకీకృత సర్వీస్‌ ‌రూల్సును రూపొందించి ఆయా క్యాడర్‌ ‌ల వారీగా అర్హత గల టీచర్ల కి ప్రమోషన్‌ అవకాశం కల్పించి రెగ్యులర్‌ ‌యం.ఈ.ఓ పోస్టులను భర్తీ చేయాలని మా మనవి.
– కామిడి సతీశ్‌ ‌రెడ్డి, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా..9848445134.

Leave a Reply