Take a fresh look at your lifestyle.

ఆర్థిక సాయం.. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు..

  • ఆర్థిక, ఇతరత్రా సాయం ప్రకటించిన సిఎం కెసిఆర్‌
  • ‌డిఇ శ్రీనివాస్‌ ‌కుటుంబానికి 50 లక్షలు, మిగితా వారి కుటుంబాలకు 25 లక్షలు
  • కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం.. శాఖాపరమైన ప్రయోజనాలు
శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంలొ మరణించిన వారి కుటుంబాలకు సిఎం కెసిఆర్‌ ఆర్థిక సహాయం, ఇతరత్రా సహాయాలు ప్రకటించారు. మరణించిన డిఇ శ్రీనివాస్‌ ‌కుటుంబానికి రూ. 50 లక్షలు, మరణించిన మిగితా వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున అందజేయనున్నట్లు సిఎం ప్రకటించారు. మరణించి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు అందజేస్తామని సిఎం ప్రకటనలో వెల్లడించారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మృతి చెందిన ఉద్యోగుల పార్థివ దేహాలకు మంత్రి  జగదీష్‌ ‌రెడ్డి నివాళి
శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన సంఘటన దురదృష్ట కరమైనదని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.  సంఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి బయలు దేరి సంఘటనా స్థలికి 2.30 గంటలకు చేరుకున్నా ఉద్యోగస్తులను దక్కించుకోలేక పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన జెన్కో ఉద్యోగుల పార్థివ దేహాలను ఆయన శుక్రవారం సాయంత్రం సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మంత్రి జగదీష్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయంగా తనతో పాటు రీస్క్యూ టీంలు ఉద్యోగుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం తనను కలచి వేస్తుందని గద్గద స్వరంతో ఆవేదన వెలిబుచ్చారు.
ప్లాంట్‌ను కాపాడే  ప్రయత్నంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఉద్యుగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌కుటుంబానికి 50 లక్షలు మిగితా వారికి ఒక్కొక్కరికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అం‌గీకరించారన్నారు. శాకాపరమైన బెన్ఫిట్లు యదాతదంగా ఉంటాయన్నారు. ఇప్పటికే జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సీబీసీఐడి విచారణకు అదేశించారన్నారు. తోటి ఉద్యోగులను కాపాడుకునేందుకు సహచర ఉద్యోగులతో పాటు పోలీస్‌,అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారని ఆయన చెప్పారు. ఒక్కసారిగా జరిగిన అగ్నిప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించడంతో సొరంగ మార్గం గుండా లోపలికి పోవడం సాధ్యపడలేదు అన్నారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్‌ ‌యంపి రాములు, అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply