Take a fresh look at your lifestyle.

రాజన్న ఆలయానికి కరోనా ప్రభావం

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ అతితక్కువగా ఉంది.ప్రతినిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడే రాజన్న గుడిలో బుధవారం కేవలం పదుల సంఖ్యలో భక్తులు కనిపించారు.ఆలయంలోకి ప్రవేశించిన భక్తులను పోలీసులు స్క్రీనింగ్‌ ‌చేశారు.ధర్మగుండాన్ని ఇప్పటికే మూసి వేసి పక్కనే గల షవర్‌ ‌బాత్‌ల కింద భక్తులు స్నానాలు చేసే అవకాశాన్ని కల్పించారు.

ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది,కళ్యాణ కట్టలో విధులు నిర్వహించే క్షురకులు మాస్క్‌లను ధరించారు.ఈ కరోనా ప్రభావంతో రానున్న రోజుల్లో రాజన్న గుడి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply