Take a fresh look at your lifestyle.

గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు తగ్గించాలి : ఐద్వా

అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘము(ఐద్వా) భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టౌన్‌ అధ్యక్షురాలు సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపు లో భాగంగా సోమవారం నిరసన కార్యక్రమం చేస్తున్నాం అని, కరోన లాక్‌డౌన్‌• ‌కారణం గా పేదలు (మహిళలు),వలస కార్మికులుని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ,లాక్‌డౌన్‌• ‌ప్రారంభం అయిన నాటి నుండి నెలకు 7500/- ఆరు నెలల పాటు పేదల అకౌంట్లో వేయాలని, 10 కేజీల బియ్యం లేదా గోధుమలు , మరియునిత్యవసర వస్తువులు అందించి ఆహార భద్రత కల్పించాలని ,పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ ద్వారా పని కోరినవారందరికి పని కల్పించాలని,సాధారణ రోగులకు కూడా చికిత్స అందించాలని, మహిళలందరికి 3 వంటగ్యాస్‌ ‌సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

దీనికి తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ‌సిలిండర్లు ధరలు,విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేయటన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తుంది అని కరోన లాక్డౌన్‌ ‌కాలంలో మహిళపై గృహహింస కూడా బాగా పెరిగింది అని హింసని అరికట్టి రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ ‌నాయకులు యు. జీవనజ్యోతి, చోటమ్మ , లక్ష్మికాంత,ఎన్‌ ‌వరలక్ష్మి, పి. దేవి, డి. హశ్విత, డి. వెంకయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply