గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 6తరగతి నుండి 9వతరగతి చదువుచున్న పిల్లలో వెనుకబడి కనీస సామర్ధ్యాలు లేని పిల్లలను గుర్తించి నాణ్యమైన విద్య భోధించడానికి గిరిజన సంక్షేమ జిల్లా పరిషత్ పాఠశాలల్లోని 15 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి మంచి క్వాలిటితో వర్క్‌బుక్ తయారు చేసి పాఠశాలలు ప్రారంభించే సమయానికి గిరిజన సంక్షేమ పాఠశాలలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు భద్రాచలం ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రూ తెలిపారు. సోమవారం నాడు ఐటిడిఏ పియంఆర్సి భవనం నందు 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుచున్న పిల్లల కనీస సమార్ధాల మెరుగు పరచటం కొరకు గిరిజన సంక్షేమ జిల్లా పరిషత్ పాఠశాలల 15 మంది ఉపాధ్యాయులతో వర్క్‌బుక్ తయారు చేయు కార్యాలయాన్ని పిఓ పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో తెలుగు, హింధీ, గణితం సబ్జెక్టుల్లో కనీస సామర్ధాలు మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయుల సహకారం లేకుండా విద్యార్దులు తనంతట తాము నేర్చుకునే విధంగా విద్యార్దులకు అర్ధమయ్యే రీతిలో వర్క్‌బుక్ తయారు చేయిస్తున్నామని పిఓ తెలిపారు. ఈ వర్క్‌బుక్ తయారు చేయడానికి 60 రోజుల నుండి 100 రోజుల సమయం పడుతుందని అన్నారు. స్కూల్స ప్రారంభం నాటికి 10వేల వర్క్‌బుక్స్ మంచి క్వాలిటీతో ముద్రించి 6 నుండి 9వ తరగతి పిల్లలకు అం దించే విధంగా పకడ్బందిగా చర్యలు తీసుకుంటుమన్నామని అన్నారు. ఈ వర్క్‌బుక్ తయారు చేయడానికి ముందుకు వచ్చిన ఉపాధ్యాయులను పిఓ అభినం దించారు. ఈ కార్యక్రమం లో పియంఆర్సి రమణయ్య, స్వరూప్, ఇంగ్లీష్ రఘునందనరావు, గనితం కుంజా శ్రీను సంబంధిత గిరిజన సంక్షేమ జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధఙంచిన తెలుగు, హిందీ, గనితం సబ్జెక్టు ఉపాధ్యాయులు 15 మంది పాల్గొన్నారు.