Take a fresh look at your lifestyle.

ఐటిఐఆర్‌ ‌ప్రాజెక్టును ఈ ఎండు పార్టీలు గాలికొదిలేశాయ్‌

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీకి బుద్ది చెప్పండి
  • ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్‌ ‌యాత్ర
  • మీడియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఐటీఐఆర్‌ను బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాలు గాలికొదిలేశాయని సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీకి పట్టభద్రులు బుద్ధి చెప్పాలన్నారు. నేటి నుంచి సైకిల్‌పై భట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెరుగుదలకు నిరసనగా భట్టి సైకిల్‌ ‌యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. భట్టితో కలిసి సైకిల్‌ ‌యాత్రలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ ‌లోక్‌సభ స్థానాల్లో సైకిల్‌ ‌యాత్ర నిర్వహించనున్నారు. వరుసగా పెరుగుతోన్న పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే రూ.25కే లీటర్‌ ‌పెట్రోల్‌ ఇచ్చే వాళ్లం అని చెప్పుకొచ్చారు. కాగా, పెట్రోల్‌ ‌ధరలు ఇప్పటికే సెంచరీ దాటేశాయి.. ఈ సమయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉంటే.. రూ.25కే లీటర్‌ ‌పెట్రోల్‌ ‌వచ్చేలా చేసిది అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 120 డాలర్లకు పైగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రూ.75 లోపే లీటర్‌ అం‌దించింది.. ఇప్పుడు క్రూడ్‌ అయిల్‌ ‌ధర 70 డాలర్ల లోపు ఉన్నా.. భారీగా పెట్రోల్‌ ‌ధరలు ఉండడంతో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక, వచ్చే మూడేళ్లు ఉంటే అసెంబ్లీలో ఉంటా.. లేదంటే జనంలోనే ఉంటానన్న భట్టి.. కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా దుర్మార్గపు ఆలోచనతోనే వెళ్లిపోయారని ఫైర్‌ అయ్యారు.

ఈ సందర్భంగా తాజాగా పార్టీని వీడిన కూన శ్రీశైలం గౌడ్‌ ‌కామెంట్లపై స్పందించిన భట్టి… పార్టీ పనిచేయడం లేదంటే.. డీసీసీ అధ్యక్షుడిగా కూడా కూన శ్రీశైలం పని చేయనట్టేగా? అని ప్రశ్నించారు. ఇక, కాంగ్రెస్‌ ‌పార్టీ మీద నమ్మకం లేనోడు మాత్రమే బయటకు పోతాడని కామెంట్‌ ‌చేశారు. మరోవైపు.. అయోధ్య గురించే కాదు.. ప్రతీ ఊర్లో ఉన్న రాముడు గురించి కూడా మాట్లాడాలని.. అందరి రాముడ్ని.. మా ఒక్కడి రాముడే అనడం దుర్మార్గం అని మండిపడ్డారు.

Leave a Reply