Take a fresh look at your lifestyle.

సబ్బండ వర్ణాల.. ఆశలు, ఆకాంక్షలు నెరవేరేదెన్నడు

“2014-2018 ‌లోను తెలంగాణ ప్రజలు అఖండ మెజార్టీని కట్టబెట్టినారు.కానీ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పర్చడంలోను ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను కే.సీ.ఆర్‌ ‌ప్రభుత్వానికి మిశ్రమ స్పందన
ఉంది.నిరుద్యోగ సమస్య నిర్మూలనలోను ఉద్యమకాలంలో ఇచ్చిన హామీలను టీ.ఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తగిన విధగా కృషిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.తెలంగాణ ఏదో వస్తుందని ఆశ పడ్డవారికి నిరాశే మిగిలింది.క్షేత్ర స్ధాయిలో వివిధ వర్గాల బాధ•లు గాదలను తెలుసుకొని పరిష్కారం చేసే మార్గం కనబడటం లేదు.”

ravula rajesham
రావుల రాజేశం, లెక్చరర్‌
‌బి.ఈ.డి కాలేజి కరీంనగర్‌

అమర వీరుల త్యాగ ఫలం ఎందరో నాయ కుల విద్యార్ధుల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.పోరాటాల గడ్డ తెలంగాణ బిడ్డలందరు అలుపెరుగని పోరుసలిపి తెలంగాణను సాధించారు.1969 నుండి 2014 వరకు వివిద దశల్లో జరిగిన సాగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం వేలాది మంది అమరులయ్యారు.గల్లీ నుమచి డిల్లీ దాకా పోరాటాలు, ఉద్యమాలు పాలకులకు వేడిని పుట్టించాయి.సబ్బండ వర్ణాల ఆందోళనకు ఆకాంక్షకు అప్పటి కేంద్ర ప్రభుత్వం పోరాటాలకు బయపడి కమటీలను వేసింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి అప్పటి కాంగ్రెస్‌ ‌పార్టీ 2010లో శ్రీకృష్ణకమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటించి ప్రజల మనోభావాలనుపరిగణలోకి తీసుకొని 6 ప్రతిపాదనలు చేసింది.శ్రీకృష్టకమిటీ సిఫారసులతో 2013 జులై 30న కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌కమిటి ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయడం శుభసూచికం.అక్టోబర్‌ 3 2013‌న కేంద్ర మంత్రి మండలి అనేక సంప్రదింపుల అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోద ముద్ర వేసింది.2014 ఫిభ్రవరి 18న తెలంగాణ బిల్లును బి.జే.పి మద్దతుతో లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు.ఫిభ్రవరి 20న ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. భారత రాష్ట్రపతి 01-03-2014న ఆంరదప్రదెశ్‌ ‌పునర్‌ ‌వ్యవస్దీకరణ చట్టం బిల్లును ఆమోదించడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనది. 02-06-2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ  తొలి ముఖ్యమంత్రిగా కే.సీ.ఆర్‌ ‌ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.అయితే తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు, విద్యార్ధులు, యువకులు, నాయకులు సబ్బండవర్ణాల వారు బస్సు రోకోలు, సడక్‌బంద్‌లు, రైల్‌రోకోలు వంటివి కార్యక్రమాల ద్వారా అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాదించు కున్నారు.భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం శుభసూచికం. తెలంగాణకోసం ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షకు పూనుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ‌పాత్ర మరువలేనిది.1969 ఏప్రిల్‌ 12‌న తెలంగాణ తొలి ఉద్యమం ప్రారంభమైంది.

మోసాల వల్ల తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదు.నీళ్ల్లు, నిధులు, నియామకాలు 369 విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 1948 నుంచి తీరని అన్యాయం మంది తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నారు.అప్పటి రాజకీయ నాయకుల  కోసం బలిదానాలు చేసుకున్నారు.అప్పటి రాజకీయ నాయకుల జరుగుతుంది.ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం నినధించినప్పటికి వారి కోరికలు నెరవేరలేదు. 2001లో తెలంగాణ టి.డీ.పి పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రసమితిని స్ధాపించి కే.సీ.ఆర్‌ ‌సరికొత్త చరిత్రను సృష్టించారు. స్వతహాగా గొప్ప వక్త అయిన కే.సీ.ఆర్‌ ‌తన మాటల గారడీతో తెలంగాణ ఉద్యమాన్ని సరికొత్త పుంతలు తొక్కించాడు.విద్యార్ధి జీవితంలో ఉన్న రాజకీయ లక్షణాలను పొనికిపుచ్చుకుని తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సహకారంతో టీ.ఆర్‌.ఎస్‌ ‌పార్టీని స్ధాపించి వర్దమాన రాజకీయ నాయకులకు అందని విధ•ంగా రాకజీయ వ్యూహాలు రచించాడు.2001 మే 17న సింహగర్జన పేరిట భారీ బగిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణను సాధిస్తామని ప్రకటించారు.తన వాగ్దాటితో వోటర్లను.శ్రోతలను, ప్రజలను ఆకర్శించాడు.

2009న నవంబర్‌ 29 ‌న తెలంగాణే సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కరీంనగర్‌ ‌నుండి సిద్దిపేట దీక్షాస్ధలికి బయలుదేరుతుండగా మార్గమద్యంలో అల్గునూరు వద్ద పోలీసులు అరెస్ట్ ‌చేసి ఖమ్మం పట్టణానికి తరలిమచారు.అక్కడ కూడా ఆయన దీక్ష చేస్తుండటంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి ఖమ్మం సబ్‌జైలుకు తరలించి 29,30 తేదీల్లో బంధించారు.30 నవంబర్‌  ‌తేదీన జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సకల జనుల సమ్మె ద్వారా సబ్బండవర్ణాలు ఒక్కటై ఉద్యమ ఉదృతిని గల్లీ నుమటి దిల్లీకి తీసుకొని పోయాయి.తెలంగాణ ప్రజల పోరాటాన్ని గుర్తించి కేంద్రప్రభుత్వం జులై 31 2013న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుగా ప్రకటన చెసింది.కాని అంతలోనే సీమాంద్రలో వ్యతిరేకత రావడంతో కొంతకాలం తెలంగాణ విషయాన్ని పక్కకు పెట్టారు.చివరకు 2014 జూన్‌ 2‌న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు,ఉద్యమాలు ప్రారంభమై కేంద్ర ప్రభుత్వంలో కదలిక స్టాటయింది.కాంగ్రెస్‌తో పాటు బి.జే.పి కూడా మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కే.సీ.ఆర్‌ ‌తెలంగాణ రాష్ట్ర స్దాపనకు ఎంతగానో కృషిచేశారు. కే,సీ.ఆర్‌ను 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికి ఆయన ప్రజల నాడీని తెలుసుకొని వ్యవహరించారు.2014-2018 లోను తెలంగాణ ప్రజలు అఖండ మెజార్టీని కట్టబెట్టినారు.కానీ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పర్చడంలోను ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను కే.సీ.ఆర్‌ ‌ప్రభుత్వానికి మిశ్రమ స్పందన ఉంది.నిరుద్యోగ సమస్య నిర్మూలనలోను ఉద్యమకాలంలో  ఇచ్చిన హామీలను టీ.ఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తగిన విధ•ంగా కృషిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.తెలంగాణ ఏదో వస్తుందని ఆశ పడ్డవారికి నిరాశే మిగిలింది.క్షేత్ర స్ధాయిలో వివిద వర్గాల భాదలు గాదలను తెలుసుకొని పరిష్కారం చేసే మార్గం కనబడటం లేదు.

Leave a Reply