వలస కార్మికుల కదలికలపై నిఘా ఉంచాలి
వలస కార్మికుల కదలికల పై నిఘా పెంచాలని, ప్రతి వారం పారిశుధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన కోవిడ్ 19 నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి చేపట్టిన సమీక్ష సమావేశంలో రామగుండం సీపీ సత్యనారా యణతో కలిసి నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తున్నారని, దేశవ్యాప్తంగా వైరస్ కేసులసైతం పెరుగుతున్నా యని, జిల్లాలో సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరొనా వైరస్ వ్యాప్తి జరిగితే వ్యాథిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసామని, అదే సమయంలో మనకు అందుబాటులొ ఉన్న వైద్యులను, వారి సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, వారిపై అధిక ఒత్తిడి ఉండకుండా చుడాలని అన్నారు. కోవిడ్ 19, సీజనల్ వ్యాధుల నియంత్రణ కొరకు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమం కట్టుదిట్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు తప్పనిసరిగా అవసరమైన జాగ్రత్తలు పాటించాల ని తెలిపారు. అనంతరం కలెక్టర్ పిహెచ్సి వారిగా అందుబాటులో ఉన్న పిపిఈ కిట్లు, మాస్కులు, ఇతర పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని పోలిస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
జిల్లాకు వచ్చే వలస కార్మికులు కొన్ని రోజుల పాటు గృహ నిర్భందంలో ఉండాలని తెలిపారు. మన జిల్లా లో ఉన్న ప్రాథమిక ఆరొగ్య కేంద్రం వారి పరిధిలో ప్రతి వారం గ్రామాలో క్యాంపులు నిర్వహించాలని, మధుమేహం, బీపి వంటి వ్యాధులు గల వారికి అవసరమైన మందులను వారి ఇంటి వద్దకు ఏఎన్ఎం, ఆశావర్కర్లను వినియోగిస్తు అందించాలని తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్దులు, 10 సంవత్సరాల లొపు ఉన్న పిల్లలు బయటకు రాకుండా కుటుంబసభ్యులు జాగ్రత్త వహించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, కోవిడ్ 19 కట్టడి కోసం అవసరమైన రసాయనాలను స్ప్రే చేయాలని, అవసరమైన పారిశుద్ద్య పరికరాలను అందుబాటులొ ఉంచుకోవాలని సూచించారు. లాక్డౌన్ లో సడలింపులు ఇచ్చినంత మాత్రాన కరొనా ముగియలేదని, ఇప్పటికి ప్రమాదం పొంచి ఉందని, మనమంతా జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరొనా నివారణ కోసం జాగ్రత్తల పై అవగాహన కల్పించాలని, ప్రజలంతా తరచు చేతులను శానిటైజ్ చేసుకోవాలని అన్నారు. సమావేశంలో రామగుండం మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా వైద్యారొగ్య శాఖ అధికారి డా. పి. సుధాకర్, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా.శ్రీరాం, పెద్దపల్లి మెడికల్ సూపరిండెంట్ డా.వాసుదేవ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.