Take a fresh look at your lifestyle.

మౌలిక రంగంలో సమూల మార్పులు

  • ఉమ్మడి వేదిక కిందకు మౌలిక సదుపాయాల అభివృద్ది
  • నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు
  • ప్రాజెక్టులకు మరింత శక్తిని, వేగాన్ని అందించడం ప్రణాళిక లక్ష్యం
  • పిఎం గతిశక్తిని ప్రారంభించిన ప్రధాని మోడీ
  • 100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్‌ ‌ప్లాన్‌కు శ్రీకారం

ఖర్చులను తగ్గించడం, కార్గో హ్యాండ్లింగ్‌ ‌సామర్థ్యాన్ని పెంచడం, టర్నరౌండ్‌ ‌సమయాన్ని తగ్గించడం పిఎం గతి శక్తి లాజిస్టిక్‌ ‌లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. లాజిస్టిక్‌ ‌ఖర్చు తగ్గింపు, ఆర్థిక వ్యవస్థను మెరుగు, మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా మల్టీ-మోడల్‌ ‌కనెక్టివిటీ కోసం 100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్‌ ‌ప్లాన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన శాఖలన్నింటినీ అనుసంధానించడం ద్వారా ప్రాజెక్టులకు మరింత శక్తిని, వేగాన్ని అందించడం ఈ ప్రణాళిక లక్ష్యమని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మౌలిక సదుపాయాల పథకాలు ఉమ్మడి దృష్టితో రూపొందించబడి అమలు చేయబడతాయని ఆయన అన్నారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే దాన్ని సమగ్ర పద్ధతిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించిందని తెలిపారు. రోడ్డు నుండి రైల్వే వరకు, విమానయానం నుండి వ్యవసాయం వరకు ప్రాజెక్టుల సమన్వయ అభివృద్ధి కోసం గతి శక్తి వివిధ విభాగాలలో అనుసంధానించబడొందని ప్రధాని చెప్పారు. భారతదేశంలో జిడిపిలో 13 శాతంలో అధిక లాజిస్టిక్స్ ‌ఖర్చు ఎగుమతుల్లో పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొంటూ..పిఎం గతి శక్తి లాజిస్టిక్‌ ‌ఖర్చు మరియు టర్నరౌండ్‌ ‌సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఇది భారతదేశానికి పెట్టుబడి గమ్యస్థానంగా ప్రోత్సాహాన్ని ఇస్తుందని, గత 70 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో తన ప్రభుత్వంలో చూస్తున్న వేగం, గతి ఎన్నడూ చూడలేదని ప్రధాని అన్నారు.

మొదటి అంతర్‌-‌రాష్ట్ర సహజ వాయువు పైప్‌లైన్‌ 1987‌లో ప్రారంభించబడిందని, అప్పటి నుండి 2014 వరకు 15,000 కిమీ సహజ వాయువు పైప్‌లైన్‌ ‌నిర్మించబడిందని. ప్రస్తుతం 16,000 కిమీ కంటే ఎక్కువ కొత్త గ్యాస్‌ ‌పైప్‌లైన్‌ ‌నిర్మిస్తున్నారని అన్నారు. 27 సంవత్సరాలలో జరిగిన దాన్ని తాము లంతులో సగం కంటే తక్కువ సమయంలో చేస్తున్నామని ప్రధాని ఈ సందర్భంగా ఉదహరించారు. 2014లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఐదు సంవత్సరాల ముందు, 1,900 కిమీ రైలు మార్గం వేయబడిందని, కానీ గత ఏడు సంవత్సరాలలో 9,000 కిలోమీటర్ల రైలు మార్గం వేయడం జరిగిందని, అదేవిధంగా, 2014కి ముందు ఐదు సంవత్సరాలలో 3,000 కిమీ రైల్వే లైన్‌ ‌విద్యుదీకరణ జరుగగా, గత ఏడు సంవత్సరాలలో 24,000 కిమీ రైల్వే లైన్‌ ‌విదుదీకరణ జరిగిందని తెలిపారు. 2015లో 250 కి.మీ మెట్రో నుండి, మెట్రో రైలు నెట్‌వర్క్ 700 ‌కిమీలకు విస్తరించిందని, మరో 1,000 కిమీ జరుగాల్సి ఉందని, 2014 కి ముందు ఐదు సంవత్సరాలలో 60 గ్రామ పంచాయితీలతో పోలిస్తే గత ఏడు సంవత్సరాల్లో 1.5 లక్షల గ్రామ పంచాయితీలు ఆప్టిక్‌ ‌ఫైబర్‌ ‌నెట్‌వర్క్‌తో అనుసంధానించబడ్డాయని ప్రధాని అన్నారు.

గతి శక్తి ప్రణాళికలో ఒక సాధారణ వేదికను రూపొందించడం జరుగుతుంది, దీని ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల మధ్య సమన్వయం ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థవంతంగా ప్లాన్‌ ‌చేస్తూ అమలు చేయవచ్చు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలన్నా..ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నా..ఉద్యోగ కల్పన చేయాలన్నా..నాణ్యమైన మౌలిక సదుపాయాలు అవసరమని మోదీ అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్‌ ‌కాంప్లెక్స్ ‌కొత్త మోడల్‌ను కూడా ప్రధాని సవి•క్షించారు. గతిశక్తి ప్రణాళికలో సుమారు 107 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు దేశ స్వరూపాన్ని మార్చనున్నాయి. జాతీయ రహదారుల్ని బలోపేతం చేసేందుకు సుమారు రెండు లక్షల కిలోవి•టర్ల మేర ఇంటిగ్రేటెడ్‌ ‌నెట్వర్క్ ‌వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రైల్వేల ద్వారా 1600 మిలియన్‌ ‌టన్నుల కార్గోను తరలించనున్నారు. 35వేల కిలోవి•టర్ల విస్తీర్ణంలో గ్యాస్‌ ‌పైప్‌లైన్‌ ‌కనెక్టివిటీ పెంచనున్నారు. రానున్న అయిదేళ్లలో కొత్తగా 220 విమానాశ్రయాలను నిర్మించనున్నారు. మేక్‌ ఇన్‌ ఇం‌డియాలో భాగంగా 25వేల ఎకరాల విస్తీర్ణంలో 11 పారిశ్రామిక వాడలను అభివృద్ధిపరచనున్నారు. సైనిక దళాలను బలోపేతం చేసేందుకు 1.7 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. 38 ఎలక్ట్రానిక్‌ ‌తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్యవ్యవస్థను పటిష్టం చేసేందుకు 109 ఫార్మా క్లస్టర్లను ఓపెన్‌ ‌చేయనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, స్థానిక తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడడానికి, సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయపడటానికి ప్రధాన మంత్రి ఆగస్టు 15న 100 లక్షల కోట్ల ‘గతిశక్తి’ ప్రణాళికను ప్రకటించారు.

Leave a Reply