Take a fresh look at your lifestyle.

థర్మల్‌ ‌ప్లాంట్లకు పెరిగిన బొగ్గు సరఫరా

  • దసరా తరవాత సాధారణ పరిస్థితి
  • ఎప్పటికప్పుడు సవి•క్షిస్తున్నామన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్‌
  • ఉత్తరాది రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్‌ ‌కోతలు

థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లకు బొగ్గు సరఫరాను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుతున్నట్లు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషీ బుధవారం చెప్పారు. తాజా సంక్షోభం నేపథ్యంలో బొగ్గు సరఫరాను ఎప్పిటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. దసరా తర్వాత ఉత్పత్తి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్లాంట్లకు మంగళవారం సరఫరా చేసిన బొగ్గు 2 మిలియన్‌ ‌టన్నులను దాటిందని చెప్పారు. అన్ని మార్గాల్లోనూ బొగ్గు సరఫరాను పెంచుతున్నందుకు సంతోషంగా ఉందని ఓ ట్వీట్‌ ‌ద్వారా ఆమన తెలిపారు. థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లకు కోల్‌ ఇం‌డియాతో సహా అన్ని వనరుల నుంచి సరఫరా అయిన బొగ్గు స్థాయి, పరిమాణం మంగళవారం 2 మిలియన్‌ ‌టన్నులు దాటినట్లు అందరికీ తెలియజేయడానికి సంతోషంగా ఉందని ప్రహ్లాద్‌ ‌జోషీ ట్వీట్‌ ‌చేశారు. విద్యుత్తు ప్లాంట్ల వద్ద సరిపడినంత స్థాయిలో బొగ్గు నిల్వ ఉండేవిధంగా సరఫరాను పెంచుతున్నామని తెలిపారు. కోల్‌ ఇం‌డియా అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుత్తు ప్లాంట్లకు గడచిన రెండు రోజుల్లో రోజుకు 1.62 మిలియన్‌ ‌టన్నుల చొప్పున బొగ్గు సరఫరా అయింది. నెల రోజుల సగటు బొగ్గు సరఫరా 1.75 మిలియన్‌ ‌టన్నులతో పోల్చినపుడు మొత్తం సరఫరా రోజుకు 1.88 మిలియన్‌ ‌టన్నులకు పెరిగింది.

గడచిన రెండు రోజుల్లో బొగ్గు ఉత్పత్తి రోజుకు 1.6 మిలియన్‌ ‌టన్నులకు పెరిగింది. దసరా తర్వాత ఉత్పత్తి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే ఉత్తరాది మొత్తం వి•ద పంజాబ్‌ ‌తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటుంది. ప్రస్తుత బొగ్గు సంక్షోభం ఆ రాష్ట్రాన్ని మరింత దెబ్బతీస్తుంది. అక్టోబరు 11న దాదాపు 2,300 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడటంతో, విద్యుత్తు కోతలను అమలు చేసింది. మంగళవారం కూడా 4 నుంచి 7 గంటల పాటు విద్యుత్తు కోత విధించింది. సోమవారంనాటి రోజువారీ కార్యకలాపాల నివేదిక ప్రకారం పంజాబ్‌లో 11,046 మెగావాట్ల విద్యుత్తుకు డిమాండ్‌ ఉం‌డగా, వినియోగదారులకు 8,751 మెగావాట్లు సరఫరా చేశారు. ఈ నివేదికను నార్తర్న్ ‌రీజనల్‌ ‌లోడ్‌ ‌డిస్పాచ్‌ ‌సెంటర్‌ ‌విడుదల చేసింది. హర్యానాలో విద్యుత్తు డిమాండ్‌ 8,382 ‌మెగావాట్లు కాగా, కేవలం 63 మెగావాట్లు మాత్రమే తక్కువ సరఫరా అయింది. వినియోగదారులకు 8,319 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేశారు. రాజస్థాన్‌లో 12,534 మెగావాట్ల విద్యుత్తుకు డిమాండ్‌ ఉం‌ది, అయితే 272 మెగావాట్లు తగ్గింది. వినియోగదారులకు 12,262 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేశారు. ఢిల్లీలో విద్యుత్తు కొరత లేదు.

అక్టోబరు 11న విద్యుత్తు డిమాండ్‌ 4,683 ‌మెగావాట్లు కాగా, ఈ మొత్తం విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో 19,843 మెగావాట్ల విద్యుత్తుకు డిమాండ్‌ ఉం‌ది, అయితే 18,973 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే వినియోగదారులకు అందించగలిగారు. ఈ రాష్ట్రంలో 870 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉంది. ఉత్తరాఖండ్‌లో విద్యుత్తు డిమాండ్‌ 2,052 ‌మెగావాట్లు కాగా, 1,862 మెగావాట్లు మాత్రమే సరఫరా అయింది. హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో విద్యుత్తు కొరత లేదు. జమ్మూ-కశ్మీరులో 200 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉంది. పంజాబ్‌ ‌రాష్ట్ర విద్యుత్తు మండలి ఇంజినీర్స్ అసోసియేషన్‌ ‌ప్రధాన కార్యదర్శి అజయ్‌ ‌పాల్‌ ‌సింగ్‌ అట్వల్‌ ‌మాట్లాడుతూ, ప్రభుత్వ యాజమాన్యంలోని థర్మల్‌ ‌ప్లాంట్లను పీఎస్‌ఈబీ నడిపేటపుడు 30-40 రోజులకు సరిపోయిన బొగ్గును నిల్వ చేసేదని చెప్పారు. ఈ విధంగా నిల్వలను ఉంచుకుని ఉంటే, పంజాబ్‌దే పైచేయి అయి ఉండేదన్నారు. విద్యుత్తును కొనడం కాకుండా, ప్రీమియం రేట్లకు అమ్మగలిగేదని చెప్పారు.

Leave a Reply