Take a fresh look at your lifestyle.

పరిసరాల పరిశుభ్రతకు ప్రాముఖ్యతనివ్వాలి

పరిసరాల పరిశభ్రతకు ప్రాముఖ్యతనివ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. బుధవారం అంతర్గాం మండలం ఎగ్లాస్‌పూర్‌ ‌గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ద్య పనులను, నర్సరీని పరిశీలించారు. పారిశుద్ద్య నిర్వహణకు గ్రామ పంచాయతిలు అధిక ప్రాధాన్యత ఇవ్వా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితహారం మొక్కలు నాటేందుకు వీలుగా ఉన్న ప్రదేశాలను సైతం గుర్తించాలని కలెక్టర్‌ ‌సూచించారు. ఎక్లాస్‌ ‌పూర్‌ ‌గ్రామ పంచాయతి పరిధిలో పారిశుద్ద్య పనులు అస్తవ్యస్తంగా ఉండటం పట్ల కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేసారు. వర్షాకా లం దృష్టిలో పెట్టుకొని పారిశుద్ద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సీజనల్‌ ‌వ్యాధుల నివారణ కొరకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ద్య వారొత్సవాలను సమర్థవంతం గా నిర్వహించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమ న్వయంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తు పరిసరాల శుభ్రత పెంచాలని ఆదేశించారు. పారిశుద్ద్య నిర్వహణ పట్ల అలసత్వం వహించే వారి పై తప్పనిసరిగా చర్యలు తీసుకుం టామని, ప్రజల ఆరొగ్యానికి సంబంధించిన అం శంలో పొరపాట్లను ఉపేక్షించే అవకాశం ఉండదని స్పష్టం చే సారు. గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా గుంత లను పూర్తి స్థాయిలో పూడ్చివేయాలని, పాతబడిన బావుల ను పూడ్చివేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదే శించారు. గ్రామంలోని ప్రతి నివాసంలో తప్పనిసరిగా ఫాగింగ్‌ ‌చేయాలని, దోమల నివారణ కోసం పాటించాల్సి న అంశాల పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో చెత్త నిర్వహణ, మొక్కల సంరక్షణ కోసం కొనుగొలు చేసిన ట్రాక్టర్‌, ‌ట్యాంకర్లను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి రోజు గ్రామ పంచాయతి పరిధిలో చెత్త సేకరణ చేయాలని, తడి చెత్త పొడి చెత్త వేర్వేరు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్‌ 19, ‌వర్షాకాలం నేపథ్యంలో అలసత్వం వహించడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , అప్రమ్తతంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలో ఉమ్మి వేసినా, చెత్త వేసినా భారీ జరిమానా వసూళ్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్‌ ‌బండి ప్రకాశ్‌,‌జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వినోద్‌ ‌కుమార్‌, ‌జిల్లా పంచాయతి అధికారి వి.సుదర్శన్‌, ‌ప్రత్యేక అధికారి జిల్లా పశుసంవర్థక అధికారి రాజన్న, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో సీజనల్‌ ‌వ్యాధుల నియంత్రణ : కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌పెద్దపల్లి టౌన్‌ : ‌ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్‌ ‌వ్యాధులను నియంత్రణ సాధ్యమని జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు టీచర్స్ ‌కాలనీలో మంగళవారం కలెక్టర్‌, ‌మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌మమతారెడ్డితో కలిసి పర్యటించారు. సీజనల్‌ ‌వ్యాధుల నివారణ కోసం ప్రణాళికాబద్దంగా పనిచేయాలని కలెక్టర్‌ ‌సూచించారు. టీచర్స్ ‌కాలనీలోని పలు వీధులను పరిశీలించిన కలెక్టర్‌ ‌స్థానిక ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. సీజనల్‌ ‌వ్యాధులను నివారించడానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి, రాబోయే వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్‌ ‌పేర్కొన్నారు. జూన్‌1 ‌నుంచి 8 వరకు ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుందన్నారు. మున్సిపాల్టీలలో ప్రతి ఆదివారం 10 నిమిషాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా తమ పరిసరాలను శుభ్రం చేసుకోని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తవహించాలన్నారు. మురికి కాలువలు, ఓపెన్‌ ‌ప్లాట్స్‌లో ఉన్న పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలను తొలగించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా చికెన్‌ ‌గున్యా, డెంగ్యూ, మలేరియా మొదలగు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరు తమ ఇంట్లో, ఇంటి చుట్టు పక్కల చెత్తాచెదారం లేకుండా శ్రద్దవహించాలన్నారు. ప్రజలు మున్సిపల్‌ ‌పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించి తమ ఇంటి వద్దనే చెత్తను తడిచెత్త, పొడిచెత్తగా వేరు చేయాలన్నారు. దోమల నివారణ కోసం మున్సిపల్‌ ‌సిబ్బంది తరచుగా పట్టణంలో ఫాగింగ్‌ ‌చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ ‌కమీషనర్‌ ‌చదల తిరుపతి, తహశీల్దార్‌ శ్రీ‌నివాస్‌, ‌కౌన్సిలర్‌ ‌పెంచల రమాదేవి, వార్డు కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply