Take a fresh look at your lifestyle.

‌డ్రగ్స్‌పై నిలదీస్తే నోటీసులు ఇస్తారా

తాడేపల్లి పెద్దలను సంతోష పెట్టడానికే అన్న పట్టాభి
విజయవాడ,అక్టోబర్‌ 13 : ‌డ్రగ్స్ ‌దందాపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన తెదేపా నేతలకు పోలీసులు నోటీసులు పంపడంపై తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. వియచారణ చేసి దోషులను పట్టుకోవాల్సింది పోయి ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌ ‌పెద్దలను కాపాడేందుకే నోటీసులు పంపారా అని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన డియాతో మాట్లాడారు. క్షమాపణలు చెప్పాలంటూ పోలీసులు పంపిన నోటీసులు చిత్తుకాగితాలతో సమానమన్నారు. డ్రగ్స్ ‌దందాపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా నిలదీశామన్నారు. క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించి తీరుతాం.

పోలీసు శాఖ వైఫల్యాలను త్వరలోనే కేంద్ర సంస్థలకు అందజేస్తామని పట్టాభి అన్నారు. ఇదిలావుంటే సీఎం జగన్‌ ‌చేతకానితనం, చేతివాటం వల్లే రాష్టాన్రికి కరెంటు కష్టాలు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ ‌రవి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనం వద్దు… కషనే ముద్దు అనేది జగన్‌ ‌రెడ్డి పాలసీ అని అన్నారు. కరెంటు కోతలు, విద్యుత్‌ ‌ఛార్జీల పెంపుతో రైతులు సతమతమౌతున్నారన్నారు. కావలసినంత బొగ్గు నిల్వలున్నాయని కేంద్రం చెబుతుంటే బొగ్గు కొరత ఉందని జగన్‌ ‌రెడ్డి ఎందుకు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఓవైపు కోతలతో రైతులు సతమతమవుతున్నారని, మోటార్లకు టర్లు పెడితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు విద్యుత్‌ ‌లోటు రాకూడదని ఒక ప్రణాళికా బద్ధంగా, పకడ్బందీగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారన్నారు.

Leave a Reply