Take a fresh look at your lifestyle.

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు…

భర్త ఐసియూలో… ముగ్గురు చిన్న పిల్లలతో భార్య ఇబ్బందులు..
ఎల్లారెడ్డిపేట (ప్రజాతంత్ర విలేకరి) : గుండె సంబంధిత వ్యాధితో పాటు మూర్చ రోగంతో భర్త కరీంనగర్‌లోని అపోలో రిచ్‌ ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతుండగా భర్తకు ఖరీదైన వైద్యం చేసుకోలేక తన చిన్న, చిన్న ముగ్గురు ఆడకూతుర్లతో ఆసుపత్రిలో రోదిస్తూ భర్త చికత్స కోసం ఆర్థిక సహయాన్ని అందించాలని సంగీత వేడుకుంటుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన దినసరి కూలీ బుర్క వేణు(44) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అంతేకాకుండా మూర్చ రోగం కూడా వేణును వేదిస్తుంది. కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో స్థానిక వైద్యులు కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో శనివారం రాత్రి భార్య చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని అపోలో రిచ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వేణు పరిస్థితి విషమంగా ఉందని ఐసియూలో చేర్చారు. ఆ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు చెప్పారని సంగీత తెలిపింది. చికిత్స కోసం సుమారు 3 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు సూచించారని తెలిపింది. గత మూడు రోజుల నుండి తన భర్త ఆసుపత్రిలో ఉన్నారని ప్రతి రోజు 20వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబానికి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా వేణుకు చాలసార్లు వైద్యం కోసం అప్పులు అయ్యాయి. బాధితుడికి ముగ్గురు చిన్నారులు యసశ్రీ (10), ప్రశ్నజ్ఞ (5), సుష్మ(2)లు ఉన్నారు. ఫోన్‌ ‌పే నెంబర్‌ 9515188068 ‌పై తన భర్త వైద్య చికిత్సలకు సహయం అందించాలని బాధితుడి భార్య సంగీత దాతలను వేడుకున్నారు.

Leave a Reply