యాదాద్రిభువనగిరి, సెప్టెంబర్12 (ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా, అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అనేక సార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్ నేడు ఆదివారం మరోసారి యాదాద్రి ఆలయ సందర్శనానికి వస్తు న్నారు.
దీనిలోభాగంగా జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ శనివారం భువనగిరి డిసిపితో కలిసి ఆలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాట్లలను ఆమె డిసిపి నారాయణరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.