Take a fresh look at your lifestyle.

తెలంగాణయే ఆయన శ్వాస.. ధ్యాస

  • ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం
  • జయశంకర్‌ ‌సార్‌కు ఘన నివాళి
  • పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రద్ధాంజలి
  • జయశంకర్‌తో అనుభవాలను గుర్తు చేసుకున్న నేతలు
  • సార్‌తో ఉన్న ఫోటోను ట్వీట్‌ ‌చేసిన మంత్రి కెటిఆర్‌
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 6 : ‌తెలంగాణయే శ్వాసగా..తెలంగాణె ధ్యాసగా జయశంకర్‌ ‌సార్‌ ‌నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి కెటిఆర్‌ ‌కొనియాడారు. తెలంగాణ సిద్దాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్‌ ‌నేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జయశంకర్‌ ‌సార్‌తో తమకున్న సాన్నిహిత్యాన్ని గగుర్తు చేసుకున్నారు. వి•రు గడిపిన జీవితం మహోన్నతం.. స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా..వి•కివే మా నివాళులు..జోహార్‌  ‌జయశంకర్‌ ‌సార్‌ అం‌టూ కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. జయశంకర్‌ ‌సార్‌తో దిగిన కొన్ని ఫోటోల్లో ఇది నా ఫేవరెట్‌ ‌పిక్‌ అని తెలుపుతూ కేటీఆర్‌ ‌మరో ట్వీట్‌ ‌చేశారు. 2009, నవంబర్‌ 29‌న అలుగనూరు వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేసిన అనంతరం..జయశంకర్‌ ‌సార్‌, ‌నేను నేరుగా హనుమకొండలోని ఆయన ఇంటికి చేరుకున్నాం. ఆ తర్వాత రోజు ప్రొఫెసర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు, నన్ను వరంగల్‌ ‌జైలుకు తరలించారు అని కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌జయంతి సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. వి•రు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం..యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని పేర్కొన్నారు. సార్‌ ఆశించినట్లుగా స్వయం పాలన సాకారమై, సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
image.png
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు జయశంకర్‌ ‌సార్‌ ‌మార్గదర్శిగా తోడ్పాటు అందించి సిద్దాంత కర్తగా చరిత్రలో నిలిచిపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పేర్కొన్నారు. తెలంగాణ వొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ఆకాంక్షలను, ఆశయాలను అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. జయశంకర్‌ ‌సార్‌ ‌జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. జయశంకర్‌ ‌సార్‌ ‌జయంతి, వర్ధంతిలను ఘనంగా నిర్వహించడం, ఆయన సేవలను స్మరించుకోవడం ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.ఆచార్య జయశంకర్‌ ‌జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్‌లోని టీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌రూరల్‌ ‌డెవలప్‌మెంట్‌ ఆవరణలో జయశంకర్‌ ‌సార్‌ ‌చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ 88‌వ జయంతి సందర్భంగా నిర్మల్‌ ‌పట్టణంలో జయశంకర్‌ ‌విగ్రహానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్‌ ‌తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. జయశంకర్‌ ‌సార్‌ ‌తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు జయశంకర్‌ ‌చేసిన సేవలు చిరస్మరణీయమని, వ్యవయసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌పేరు పెట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ప్రతీ ఏటా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో నీళ్లు..నిధులు..నియామకాలు అనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్‌ ‌ముష్రఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ ‌హేమంత్‌ ‌బొర్కడే, నిర్మల్‌ ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌గండ్రత్‌ ఈశ్వర్‌, ‌జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎ‌ర్రవోతు రాజేందర్‌, ‌నిర్మల్‌ ‌పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు మారుగోండ రాము, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
image.png
టిఆర్‌ఎస్‌ ‌భవన్‌లో ఘనంగా జయంతి వేడుకలు
చిన్నతనం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించిన వ్యక్తి జయశంకర్‌ ‌సార్‌ అని హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. తెలంగాణపై అనేక అంశాల్లో సీఎం కేసీఆర్‌ ‌కు ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు అవగాహన కల్పించిన వ్యక్తి అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో జయశంకర్‌ ‌సార్‌ ‌జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్‌ ‌విగ్రహానికి హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ‌మాగంటి గోపీనాథ్‌, ‌లక్ష్మారెడ్డి, మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి, కార్పొరేషన్‌ ‌చైర్మన్లు రాజీవ్‌ ‌సాగర్‌, ‌గజ్జెల నగేష్‌, ‌మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ ‌రెడ్డి, మాజీ మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌ ‌తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply