Take a fresh look at your lifestyle.

నిర్బందాల వల్ల ఉద్యమాలు ఏర్పడుతాయి: ప్రొఫెసర్ హరగోపాల్

pro haranath
అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రొఫెసర్ ఖాసీంను విడుదల చేయాలి -ప్రొఫెసర్ హరగోపాల్

ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంఘ నాయకులకు రక్షణ కారువైందని పౌర హక్కుల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బందాలు పెరిగినప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన విప్లవ రచయితల సంఘం కార్యదర్శి ప్రో ఖాసీం ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో విప్లవ రచయితల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు భయాన్ని సృష్రించేందుకే ఖాసీం ఇంటి తలపులు పగలగొట్టి అరెస్ట్ చేశారు. నాలుగేళ్లుగా కనపడటం లేదని కోర్టును కూడా తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు నోటీసులు ఇచ్చి ఉంటే ఆయన ప్రజాస్వామ్యబద్దంగా హాజరయ్యే వారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన ఖాసీం పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయనియమైన చర్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖునీ అయ్యిందని విమర్శించారు.

ప్రజా సమస్యలపై మాట్లాడే వ్యక్తులపై ప్రభుత్వం నిర్బందాలు పెడుతుందని ఆరోపించారు. ఇప్పటికి 16 మంది ప్రజా సంఘ నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి, ఉపా చట్టాలను పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖాసీం చేసిన ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రజలు ఐక్యమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని నిర్బంధం, పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఉండటం బాధాకరమని తెలిపారు. ఈ చర్యపై రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. భేషరత్తుగా ప్రో ఖాసీం ను విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, సహాయ కార్యదర్శి వివేరా, రాము, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Tags: pro haranath, pro kaasim, trs party, telangana govt

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply