Take a fresh look at your lifestyle.

సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలి

సాగునీటి నీ పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం ఏ యం ఆర్ పి లో లెవల్ కెనాల్ కు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే హై లెవల్ కెనాల్ ద్వారా 2 లక్షల 20 వేల ఎకరాల కు నీరందించడం తో పాటు 225 చెరువులు కుంటలు నింపిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.ఆ క్రమంలోనే నేడు విడుదల చేసిన లో లెవల్ కెనాల్ ద్వారా సుమారు 50వేల పై చిలుకు ఎకరాలకు నీరు అందించడం తో పాటు 0.65 టి యం సి నీటి తో 27 చెరువులు కుంటలు నింపేందుకు అవకాశం ఉందన్నారు.

లో లెవల్ కెనాల్ నుండి విడుదలైన నీరు వాస్తవానికి ఏప్రిల్ 4 వరకు గడువు తేదీ గా వారాబందీ పద్దతిలో వదులుతున్నప్పటికి అప్పుడున్న పరిస్థితులను బట్టి నీటిలభ్యత ను ఆధారం చేసుకుని గడువును ముందుకు జరిపే అవకాశం లేకపోలేదని ఆయన ప్రకటించారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ శాసనసభ్యులు నోముల నర్సింహామయ్యా,ఎన్.భాస్కర్ రావు,కంచర్ల భూపాల్ రెడ్డి రైతు సమన్యయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ఆప్కాబ్ మాజీ చైర్మన్ విజయేందర్ రెడ్డి టి ఆర్ యస్ రాష్ట్ర నాయకులు యం సి కోటిరెడ్డి,కే వి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags: Harvesting water, saving, guntakandla, jagadesh reddy, lever canal

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply