Take a fresh look at your lifestyle.

రామప్ప… జయహో

జయజహో రామప్ప
గుర్తింపు వరల్డ్ ‌గ్రేటప్పా

తేలిక నేలపై అతిబరువైన నిర్మాణం
అద్భుత ఇంజనీరింగుకు కొలమానం

నీళ్ళలో తెలియాడే ఇటుకలు ఇక్కడ
ఈ వింత చూడుము భూమిపై మరెక్కడ

జీవం ఉట్టిపడే శిల్పాలకు నెలవు
మదనికల నృత్య భంగిమల కొలువు

పిలుస్తాడేమోనని గుడిలో శివుడు
చెవులురెక్కించి చూస్తున్న నందీశ్వరుడు

శిల్పిరామప్ప నీ కళ అజరామరం!!
పాదపాదాన అందుకో మా నీరాజనం!!

సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర
కత్తెరశాల కుమార స్వామి

Leave a Reply