వీటన్నింటి కోసం దాదాపుగా రూ.16,236 కోట్లు ఖర్చు
ఉన్నతస్థాయి సక్షలో సిఎం జగన్ వెల్లడి
అమరావతి, జూలై26 : ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మల్టీ పర్పస్ సెంటర్లు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాససింగ్, ఫిషింగ్ హార్బర్లు, బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు తదితర అంశాలపై సీఎం సక్ష నిర్వహించారు. వ్యవసాయ, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, అగ్రి ఇన్ఫ్రా), పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో సక్ష నిర్వహించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతంపై చేపడుతున్న కీలక ప్రాజెక్టులపై సీఎం సక్షించారు. రెండో దశ పనులకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు.వీటన్నింటి కోసం దాదాపుగా రూ.16,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకే రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు (ఎంపీఎఫ్‌సీలు), దీనిలో భాగంగా ఆర్బీకేల వద్ద 15 రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ప్లాట్‌ఫాంలు, గోడౌన్లు, హార్టికల్చర్ మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్ మెంట్లు ఉంటాయన్నారు. మార్కెట్ యార్డుల్లో నాడు-నేడు కింద పనులతో పాటు ఇ-మార్కెటింగ్ వీటన్నింటికోసం అంచనా ఖర్చు రూ.2930 కోట్లుగా అంచనా వేశారు. ఆర్బీకేల స్ధాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటుకు నిర్ణయించారు. నియోజకవర్గాల స్ధాయిలో ఫామ్ మెకనైజేషన్ (హైటెక్ హై వాల్యూ హబ్స్) ఏర్పాటు చేస్తారు. తొలిదశలో 3250 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు, ఇదివరకే ప్రారంభించారు. రెండో దశలో కింద సెప్టెంబరు నాటికి మరో 3250 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు, వీటిలో 500 హార్వెస్టర్లు, 85 హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. మూడో దశలో భాగంగా డిసెంబరు నాటికి 4250 కమ్యూనిటీ సెంటర్లు, 535 హార్వెస్టర్లు, 85 హబ్స్ ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, 1035 కంబైన్డ్ హార్వెస్టర్లు, 175 హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం దాదాపు రూ.2,134 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల వల్ల రైతులకు అందుబాటులో పరికరాలు ఉంటాయని సిఎం అన్నారు. తక్కువ ఖర్చుకే అందుబాటులోకి వ్యవసాయ ఉపకరణాలు ఉంటాయన్నారు.
వ్యవసాయ పరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యాలు పెంచాలని సీఎం ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. దీనివల్ల గ్రామస్ధాయిలో వ్యవసాయ యంత్రపరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉంటాయన్న సీఎం, ఏ యంత్ర పరికరం ఎంత అద్దెకు లభ్యమవుతుందన్న విషయాన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ విషయంలో రైతులతో ఏర్పడ్డ రైతుసలహామండలి అభిప్రాయలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలనిఅధికారులకు స్పష్టం చేసారు. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంబంధిత పరికరాలున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను పెట్టాలని సీఎం ఆదేశించారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు, వీటికోసం అంచనా వ్యయం రూ.4,190 కోట్లు చేస్తారు. సముద్రతీర ప్రాంతాల్లో భారీగా ఫిషింగ్ హార్బర్లను, ఫిష్ ల్యాండ్సెంటర్లపై సీఎం సక్షలో భాగంగానే చేపలు, రొయ్యల ప్రాససింగ్ యూనిట్లు, ప్రాససింగ్ యూనిట్లు, పిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఆక్వా హబ్స్ నిర్మాణం, దీనికోసం రూ.3997 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. ఆక్వాలో 10 ప్రాససింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాససింగ్ యూనిట్లు, 100 ఆక్వా హబ్స్ మొత్తంగా 133 ఏర్పాటు చేయనున్నారు. 2022 సెప్టెంబరు నెలాఖరునాటికి ప్రాససింగ్ యూనిట్ల కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు ప్రణాళిక రూపొందిచాలన్నారు. చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, కొత్తపట్నంలోనూ పిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణంతో పాటు మరో 20 ప్రాంతాల్లో ప్లోటింగ్ జెట్టీల ఏర్పాటుకు ప్రయత్నాలు చేయనున్నారు.