Take a fresh look at your lifestyle.

దొంగలు పడ్డ ఆరు నెలలకు…కుక్కలు మొరిగినట్టుంది కేటీఆర్‌ ‌సవాల్‌

  • బండి సంజయ్‌పై కేటీఆర్‌ ‌వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా…
  • డికె అరుణ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు

హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌రెండేళ్ల క్రితం మా అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌చేసినప్పుడు…నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్‌..అప్పుడు డ్రగ్స్ ‌తీసుకున్నందుకే ఇవ్వలేదా…అని మంగళ వారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏ డ్రగ్‌ ‌తీసుకున్నా… ఆ (ఉత్ప్రేరకం) డ్రగ్‌ ఆనవాళ్లు, మనిషి శరీరంలో డ్రగ్‌ని బట్టి, 24 గంటలు, కొన్ని డ్రగ్స్‌లో ఆరు నెలల నుంచి 9 నెలలు మాత్రమే ఉంటాయని ప్రకటనలో పేర్కొంటూ..దున్నపోతు మీద వర్షం పడ్డట్టు…రెండేళ్ల క్రితం బండి సంజయ్‌ ‌చేసిన సవాల్‌కు స్పందించకుండా…ఇప్పుడు నువ్వు ప్రతి సవాల్‌ ‌విసిరితే ఏం లాభం కేటీఆర్‌?..‌నువ్వు డ్రగ్స్ ‌తీసుకున్న తర్వాత…మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక, విదేశాలకు వెళ్లి, డి అడిక్షన్‌ ‌ట్రీట్మెంట్‌ ‌తీసుకుని వొచ్చాక…నీ బాడీలో డ్రగ్‌ ఆనవాళ్లు ఏమి లేవని నిర్ధారించుకున్నాకే…దొంగ సవాల్‌ ‌విసురుతున్నావా కేటీఆర్‌ అని ప్రశ్నించారు.

నీకు దమ్ము, ధైర్యం ఉంటే..నువ్వు నిజంగా డ్రగ్స్ ‌తీసుకోకపోతే….మా బండి సంజయ్‌ ‌చేసిన సవాల్‌కు, అప్పుడే ఎందుకు స్పందించలేదు..అని సవాలు చేస్తూ అప్పుడే నువ్వు నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ, లివర్‌ ‌సహా నీ బాడీలో ఇంకా ఏమైనా పార్టస్ ఉం‌టే…అవి ఇవ్వకుండా…ఇన్ని రోజులు ఎందుకు ఆగావు కేటీఆర్‌?..ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన బండి సంజయ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం?..సీఎం కొడుకై ఉండి, భవిష్యత్‌ ‌సీఎం నువ్వే అని ప్రచారం చేయించుకుంటున్న నువ్వే… ఇలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేస్తే…ప్రజలే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వొస్తాయి..నీ ఉడత ఊపులకు… పిట్ట బెదిరింపులకు, పిల్ల చేష్టలకు ఇక్కడ ఎవరూ భయపడరు. ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టాలో…ప్రజలే నిర్ణయిస్తారు…మీ పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

Leave a Reply