‘అతడు’ నగ్న వంచనకు బలి
‘ఆమె’ కు ఇదో రకం డబ్బు ఆకలి
న్యూడ్ గా చాటింగ్ కు వీడియో
బ్లాక్ మెయిల్ కు భలే ఐడియా
కవ్వింపు మాటలు నమ్మవద్ధు
వగలుతో వలవిసిరితే పడిపోవద్ధు
నగ్నంగా చాట్ కు రెచ్చగొడుతుంది
తొలుత ‘ఆమే’ అలాగే కనిపిస్తుంది
పిదప అతడిని బొక్కా బోర్లపడేస్తది
ఆ విడియోతో బ్లాక్ మెయల్ చేస్తది
పైకం ఇవ్వకుంటే ఆన్లైన్లో పెడ్తనంటది
ఇస్తుంటే… తీసుకుంటూనే ఉంటది
హనుమంతుడి తోకలా అవుతంటది
ఎప్పటికీ గిట్లనే నోయి దుర్గతి!!
చివరాఖరికి చావే కదా సద్గతి!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్ట్ .