Take a fresh look at your lifestyle.

దేశంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

  • 24 గంటల్లో 25,467 మందికి పాజిటివ్‌..354 ‌మంది మృతి
  • రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 57.15 కోట్లకు పైగా టీకా డోసులు

న్యూఢిల్లీ, ఆగస్ట్ 24: ‌భారత్‌లో కొత్తగా 25,467 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్‌ ‌వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సుమారు 39,486 మంది వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ ‌కొరోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్పటి వరకు కొరోనా వైరస్‌ ‌వల్ల మరణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేషన్‌ ‌రిపోర్ట్‌ను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 58.89 కోట్ల మందికి కోవిడ్‌ ‌టీకాలను వేశారు.

రాష్ట్రాలలో కోవిడ్‌ ‌టీకా అందుబాటుపై తాజా సమాచారం
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 57.15 కోట్లకు పైగా టీకా డోసులు
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోవిడ్‌ ‌టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయటంతో బాటు విస్తరించింది. జూన్‌ 21‌న సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మరిన్ని టీకా డోసులు అందుబాటులో ఉంచటం ద్వారా టీకాలివ్వటాన్ని బాగా పెంచింది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేలా టీకా డోసుల అందుబాటుపై ముందస్తు సమాచారం ఇస్తూ సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేసింది. దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా మందును ఉచితంగా అందిస్తుంది. సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్త దశలో భాగంగా కేంద్రం దేశంలో తయారయ్యే టీకా మందు డోసులలో 75 శాతం మేరకు ఉచితంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందిస్తుంది. కేంద్రం ఇప్పటిదాకా 57,15,22,580 టీకా డోసులు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చింది. మరో 1,00,84,700 డోసులు సరఫరాలో ఉన్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం 3,29,58,715 డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర, ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల దగ్గర ఇంకా ఉన్నాయి.

Leave a Reply