Take a fresh look at your lifestyle.

‘‌మైహోం’కు భూముల కేటాయింపు పై కేసు

The case on the allotment of lands to Myhome

  • రేవంత్‌రెడ్డి పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్ట్టు
  • సంస్థకు, ప్రభుత్వానికి నోటీసు

రాయదుర్గం బయోడైవర్సీటీ సమీపంలోని మైహోం బూజా ప్రాజెక్టుకు అక్రమంగా భూ కేటాయింపులు జరిపారని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ మల్కాజ్‌ ‌గిరి ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి సోమవారం హై కోర్ట్ ‌లో పిల్‌ ‌దాఖలు చేశారు .ఈ పిల్లు ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వంతో పాటు మైహోం భూజా, డీఎల్‌ఎఫ్‌ ‌సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ భూముల కేటాయింపే అక్రమం కాగా, నిబంధనలకు విరుద్ధంగా రూ.38 కోట్ల స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇచ్చారని పిల్‌ ‌లో రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు . రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 83‌లో 424.13 ఎకరాల భూమిని 2006వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం జీవో నెంబర్‌ ఎంఎస్‌161 ‌ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఇం‌డస్ట్రియల్‌ అం‌డ్‌ ఇన్‌ ‌ఫ్రా స్ట్రక్చర్‌ ‌కార్పొరేషన్‌ ‌కేటాయించింది. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం ద్వారా ఈ భూమి ప్రభుత్వానికి సంక్రమించింది. ఏపీఐఐసీకి ఈ భూమిని కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. ఈ భూమి ఐటీ జోన్‌ ‌పరిధిలో ఉన్నందున దీనిని ఐటీ పార్కు, ఐటీ సంబంధిత ఇన్‌ ‌ఫ్రా నిర్మాణాల కోసం మాత్రమే వినియోగించాలని స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ పాలసీ ద్వారా స్పష్టంగా పేర్కొంది.ఈ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు డీఎల్‌ఎఫ్‌ ‌లిమిటెడ్‌ అనే బహుళజాతి సంస్థ భూ కేటాయింపుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.

ఇలా వచ్చిన దరఖాస్తులు షార్ట్ ‌లిస్ట్ ‌చేసి, డీఎల్‌ఎఫ్‌ ‌ట్రాక్‌ ‌రికార్డును పరిశీలించి ఆ సంస్థకు ఏపీఐఐసీ నుంచి భూ కేటాయింపులకు అప్పటి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏపీఐఐసీ నుంచి డీఎల్‌ఎఫ్‌ ‌లిమిటెడ్‌ ‌సబ్సిడరీ కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్‌ ‌రాయదుర్గం డెవలపర్స్ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ అనే సంస్థకు రూ.580 కోట్ల విలువ చేసే 31.35 ఎకరాల భూమి బదలాయింపు జరిగింది. సర్వే నెంబర్‌ 83/1 ‌లోని భూమిలోని ప్లాట్‌ ‌నెంబర్‌ 6,7,11,12 ‌లలో 25 ఎకరాలు, ప్లాట్‌ ‌నెంబర్‌ 14/%‌శాతంలో 6.3 ఎకరాలు డీఎల్‌ఎఫ్‌ ‌కు కేటాయించారు. భూమిని కేటాయిస్తూ ఇచ్చిన లేఖలోని నిబంధన 16,17 ప్రకారం ఏపీఐఐసీ ద్వారా సేల్‌ ‌డీడ్‌ ఇష్యూ అయ్యే వరకు ఈ భూమిని ఎవరికీ బదలాయించడం నిషేధం. ఇలా అక్రమంగా జరిగిన భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ రేవంత్‌ ‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దాని పర్యవసానంగా పిల్‌ ‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, మైహోం, డీఎల్‌ఎఫ్‌ ‌సంస్థలకు నోటీసులు జారీ చేసి, విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

Leave a Reply