Take a fresh look at your lifestyle.

నివాసయోగ్యత సూచికలో భారత మహానగరాలు..!

(ఇటీవల ఈఐయు సంస్థ విడుదల చేసిన ‘‘క్వాలిటీ ఆఫ్‌ ‌లైఫ్‌/‌లివబులిటీ ఇండెక్స్ – 2023’’ ‌నివేదిక ఆధారంగా)

ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో నెలకొన్న ప్రజారోగ్య వసతులు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక/వినోదాత్మక సంపదలు, విద్య, స్థిరత్వ ప్రజాపాలన, మౌళిక వనరుల కల్పన వంటి అంశాల్లో 173 దేశాలు, 173 ప్రపంచ నగరాల నివాసయోగ్యత, దేశాల జీవన ప్రమాణాలను అధ్యయనం చేసిన ‘ఎకానమిస్ట్ ఇం‌టెలిజెన్స్ ‌యూనిట్‌, ఈఐయూ’ సంస్థ ‘గ్లోబల్‌ ‌లివబిలిటీ ఇండెక్స్ ‌లేదా ప్రపంచ నివాసయోగ్యత సూచిక-2023’ అనబడే నివేదికను ఇటీవల విడుదల చేసింది. కరోనా నిబంధనలు తొలగి, కల్లోల వాతావరణం సమసిపోవడంతో ప్రజా జీవితాలు పూర్వపు స్థితికి రావడం, విద్యాలయాలు వడివడిగా తెరుచుకోవడంతో ప్రజల జీవన ప్రమాణాలు, నివాసయోగ్యతలు కొంత మేరకు మెరుగుపడినట్లు నివేదిక స్పష్టం చేసింది.
అత్యంత నివాసయోగ్య ప్రపంచ నగరాలు:
అత్యంత నివాసయోగ్యమైన 173 విశ్వ నగరాల జాబితాలో వియన్నా (ఆస్ట్రియా) నగరం ‘సిటీ ఆఫ్‌ ‌డ్రీమ్స్’‌గా పిలువబడుతూ ప్రథమ స్థానం దక్కించుకోగా తరువాత 2, 3, 4వ స్థానాలను  కోపెన్‌హాగన్‌ (‌డెన్మార్క్), ‌మెల్బర్న్(ఆ‌స్ట్రేలియా), సిడ్నీ(ఆస్ట్రేలియా) నగరాలు దక్కించుకున్నాయి. తొలి 10 నివాసయోగ్య నగరాల జాబితాలో కెనడాకు చెందిన 3 నగరాలు (7వ స్థానంలో కాల్గరీ, 5వ స్థానంలో వాంకోవర్‌, 9‌వ స్థానంలో టొరంటో), స్విస్‌కు చెందిన 2 నగరాలు (6వ స్థానంలో జూరిచ్‌, 7‌వ స్థానంలో జెనీవా), ఒసాకా ( జపాన్‌)‌తో పాటు ఆక్లాండ్‌(‌న్యూజిలాండ్‌) ‌నగరాలు 10వ స్థానంలో నిలిచాయి. నివాసయోగ్య జాబితాలో చివరన డమాస్కస్‌(‌సిరియా), ట్రిపోలీ(లిబియా), అల్జియర్స్(అల్జీరియా) నగరాలు 173, 172, 171 వరుస స్థానాల్లో  నిలిచాయి. ఈ నగరాల్లో ప్రజా సంక్షోభాలు, తీవ్రవాదం, అశాంతియుత వాతావరణాల కారణంగా జీవన ప్రమాణాలు, నివాసయోగ్యతలో చిట్ట చివరగా నిలిచాయని స్పష్టం అవుతున్నది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ ‌రాజధాని నగరం కీవ్‌కు 165వ స్థానం, కరాచీ(పాకిస్థాన్‌)‌కు 169వ స్థానం, ఢాకా(బంగ్లాదేశ్‌)‌కు 166వ స్థానం దక్కాయి.
నివాసయోగ్య సూచిక-2023లో భారత నగరాలు:    ప్రపంచవ్యాప్త 173 దేశాల నివాసయోగ్యత సూచిక జాబితాలో ఇండియా 54వ స్థానం దక్కించుకోవడం కొంత ఊరటనిస్తున్నప్పటికీ, మన దేశంలోని ఐదు మహానగరాలైన న్యూడిల్లీ(141 ర్యాంకు), ముంబాయి(141 ర్యాంకు), అహ్మదాబాదు(147 ర్యాంకు), చెన్నై(144 ర్యాంకు), బెంగుళూరు(148 ర్యాంకు) జాబితాలో కొంత వరకు చివరి ర్యాంకులను పొందడం అసంతృప్తికి కారణం అవుతున్నది. మన మహానగరాల్లో నెలకొని ఉన్న గాలి కాలుష్యం, వాహన రద్దీ, రోడ్డు వసతులు, ప్రజారవాణ లాంటి అంశాలు మన స్థానాలను చివరికి చేర్చుతున్నాయని అర్థం అవుతున్నది.
జీవన ప్రమాణాల సూచిక-2023లో ప్రపంచ దేశాలు :  అత్యంత ఉత్తమ జీవన ప్రమాణాలు కలిగిన 84 దేశాల జాబితాలో నెథర్‌లాండ్స్, ‌డెన్మార్క్, ‌స్విస్‌, ‌లాక్జెన్బర్గ్, ‌ఫిన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, ఆ‌స్ట్రియా, ఓమెన్‌, ఆ‌స్ట్రేలియా, నార్వే దేశాలు తొలి 10 స్థానాలను దక్కించుకున్నాయి. ఇదే జాబితాలో జపాన్‌(13‌వ స్థానం), యూఎస్‌(17), ‌కెనడా(25), సింగపూర్‌(28), ‌ఫ్రాన్స్(30) ‌స్థానాల్లో నిలిచి ఇతర దేశాలకు ఆదర్శంగా వెలుగుతున్నాయి. ఇండియాకు 54వ స్థానం దక్కగా, చివరన 84వ స్థానంలో నైజీరియా, 83వ స్థానంలో బంగ్లాదేశ్‌, 81‌వ స్థానంలో శ్రీలంక, 67వ స్థానంలో పాకిస్థాన్‌, 66‌వ స్థానంలో రష్యా, 65వ స్థానంలో చైనా, 59వ స్థానంలో ఉక్రెయిన్‌ ‌దేశాలు చోటు పొందాయి.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply