Take a fresh look at your lifestyle.

జనారెడ్డిపై కెసిఆర్‌ ‌వ్యాఖ్యలు దారుణం

  • ఆయన భిక్షతోనే సిఎం పదవి
  • సాగర్‌ ఎన్నిక తరవాత కెసిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌కే
  • రాజకీయాలకు జానా దిక్సూచి
  • సిఎంపై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ

రాజకీయాలకే జానారెడ్డి ఒక దిక్సూచి లాంటి వారని, జనారెడ్డి పెట్టిన బిక్షతోనే కేసీఆర్‌ ‌సీఎం అయ్యారని గుర్తుంచుకోవాలని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీ అన్నారు. కేసీఆర్‌  ‌మాటలు,  డబ్బు జానారెడ్డి ముందు పని చేయవన్నారు. కేసీఆర్‌ ‌రాజకీయ పతనం దుబ్బాకలో ప్రారంభమైందని..నాగర్జున సాగర్‌ ఉప ఎన్నిక తర్వాత పూర్తిగా క్లోజ్‌ అవుతుందని అన్నారు. జనారెడ్డి పెట్టిన బిక్షతో కేసీఆర్‌ ‌సీఎం అయ్యారన్న విషయం మరచిపోయి..ఆయనపైనే విమనర్శలు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. జనారెడ్డికి పర్మినెంట్‌ ‌రెస్ట్ ఇవ్వడం మంచిదని కేసీఆర్‌ అనడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం జానారెడ్డి అన్నారు.  జానారెడ్డికి సీఎం పదవి ఆఫర్‌ ఇచ్చినా తీసుకోలేదని.. తనకు సీఎం పదవి ఇస్తే తెలంగాణ రాదని చెప్పారన్నారు.  జనారెడ్డి ఇన్నేళ్ల రాజకీయంలో కొడుకులని కానీ.. కుటుంబ సబ్యులని ఎవరినీ రాజకీయాల్లోకి తీసుకురాలేదు చెప్పారు. కేసీఆర్‌ ‌కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. అందరిని రాజకీయాల్లోకి తెచ్చారని అన్నారు. ఇటీవల కేసీఆర్‌ ‌పామ్‌ ‌హౌస్‌లో ఆరు మండలాలకు ఐదు కోట్లు ఇచ్చారన్నారు.  నాగార్జునసాగర్‌ ఎన్నికకు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టనున్నారని తెలిపారు షబ్బీర్‌ అలీ.

జానారెడ్డి మచ్చ లేని నాయకుడని..జానారెడ్డిపై కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలన్నారు. కాగ్‌ ‌రిపోర్ట్ ‌తెలంగాణ ప్రభుత్వం వి•ద సీరియస్‌ అయిందని..కాంగ్రెస్‌ ‌చెబితే ఆరోపిస్తున్నారన్నారని, కానీ పదివేల కోట్ల స్కామ్‌ ‌జరిగిందని కాగ్‌ ‌చెప్పిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ వేసి..ఏ డిపార్ట్మెంట్‌లో ఎంత అవినీతి జరిగిందో  తేల్చాలన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంపై కూడ కాగ్‌ ఇం‌త స్థాయిలో ఎలిగేషన్‌ ‌చేయలేదన్నారు. అప్పులు తీసుకొచ్చి రెవెన్యూ అని చెపుతున్నారని..ఇప్పటికే నాలుగు లక్షల కోట్లపైనే అప్పులు చేశారన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ‌శాశ్వతంగా ఫామ్‌ ‌హౌస్‌కే పరిమితమవుతారని తెలిపారు.

Leave a Reply