Take a fresh look at your lifestyle.

క్రాంతి జాడ …గురజాడ !

సాహిత్య వికాస వీచిక
సామాజికోద్యమ దీపిక
సంఘసంస్కరణల కాగడ
తెలుగు జాతి జాగృతి జాడ
గురుజాడ వెంకట అప్పారావు

వందేళ్ల క్రితమే వ్యవస్థ చీడ మీద
యుద్ధం ప్రకటించిన కలం యోధుడు

స్త్రీ జాతి బానిస విముక్తి కోసం
అక్షర రణం సాగించిన కవన ధీరుడు

దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా అంటూ
జాతిలో దేశభక్తి రగిల్చిన దార్శనికుడు

కన్యాశుల్కం మహా నాటకంతో
దురాచారాల్ని తరిమిన ధీరోదాత్తుడు

వ్యవహారిక భాషోద్యమాన్ని
ముందుండి నడిపిన మహాసారధుడు

తెలుగు భాషా నవ వికాసానికి
నిరంతరం కృషి చేసిన దీక్షాదక్షుడు

వాస్తవిక దృక్పధ వ్యాసంగంతో
జన జాగృతం చేసిన ఋజువర్తనుడు

కుహానా గ్రాంధిక ఛందోక్తుల చీల్చి
సాహిత్యానికి వన్నెలద్దిన వెన్నెల రేడు

గురుజాడ అప్పారావు
నవయుగ వైతాళికుడు

ఆధునిక నాటక సామ్రాట్టుడు
కాలాన్ని జయించిన మహనీయుడు
అభ్యుదయ కవితా పితామహుడు

సాహితి స్ఫూర్తి ప్రదాత
తెలుగు భాష కీర్తి ప్రభాత
గురుజాడ అప్పారావుకు
అక్షర ప్రణామాలు
సాహితీ నీరాజనాలు

(నవంబర్‌ 30‌న గురజాడ అప్పారావు వర్దంతి సందర్బంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply