Take a fresh look at your lifestyle.

ధనిక రాష్ట్రమయితే .. జీతాల్లో కోతలెందుకు?

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ట్వీట్‌ ‌ద్వారా మండిపడ్డ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌

సచివాలయం కూల్చేసి కొత్తది కట్టడానికే తెలంగాణ ధనిక రాష్ట్రమా? అని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమయితే ఆర్టీసీ కార్మికుల వేతనాలలో ఎందుకు కోత వేశారని ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించడానికి పేద రాష్ట్రమా అని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్‌ ‌తీసుకుంటున్న నిర్ణయాలపై ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కార్మికులకు కనీస వేతన చట్టం అంటూ ఒకటి ఉంది తెలుసా? అని ట్విట్టర్‌లో ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సెక్రటేరియట్‌ ‌కూల్చేసి కొత్తది కట్టడానికే తెలంగాణ ధనిక రాష్ట్రమా? ఆర్టీసీ కార్మికులకు మాత్రం జీతంలో కోత పెడ్తారా? మరీ ఘోరంగా కేవలం 49 రూపాయలు వేతనం ఎలా ఇస్తారు? కనీస వేతన చట్టం అంటూ ఒకటి ఉంది తెలుసా? అంటూ ఉత్తమ్న ట్విట్టర్‌ ‌లో ట్వీట్‌ ‌చేశారు. ఓ ఆర్టీసీ డ్రైవర్‌ ‌నెల జీతం రూ. 49 అంటూ ఓ పేపర్‌లో వచ్చిన వార్తను పోస్ట్ ‌చేస్తూ  ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆ ట్వీట్‌ ‌చేశారు. విధులకు వచ్చి రిపోర్టు చేసినా చాలా మందికి గైర్హాజరు వేశారనీ, భారీ మొత్తంలో జీతాలు కట్‌ ‌చేశారనీ, ఈఎస్‌ఐ, ‌పీఎఫ్‌ ‌కటింగ్‌లు అన్నీ పోనూ సంగారెడ్డి డిపోకు చెందిన ఓ డ్రైవర్‌కు రూ.49 జీతం అందిందని ఆ వార్తలో రాశారు. చాలా మందికి  రూ.100 లోపే జీతం వచ్చిందని అందులో తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఉత్తమ్‌ ‌ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

error: Content is protected !!