Take a fresh look at your lifestyle.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ‘ప్రజా పాలన’లో లబ్ధి చేకూరుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28:   ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుకుంటుందని రాష్ట్ర బి.సి సంక్షేమం, రవాణా, హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు  పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌ వార్డు ఆఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన  ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ…  రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు అభయ హస్తంలో భాగంగా దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా అధికారులను అడగాలని ఎలాంటి ఆధారాలు లేకున్నా దరఖాస్తు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అన్నారు.

కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పదేళ్ల తర్వాత అధికారం ఇచ్చారని, ఇచ్చిన హామీల మేరకు అమలు చేయుటకు ప్రజల వద్దకు పాలన పేరుతో కార్యక్రమాలను జరుగుతుందని, అర్హతను బట్టి లబ్ధి జరుగుతుందని ఎలాంటి పైరవీలకు తావు లేదని, ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు దరఖాలు తీసుకుంటారని 6 గ్యారెంటీ లతో పాటు మిగతా సమస్యల పై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో 150 వార్డులకు గాను వార్డుకు నాలుగు లొకేషన్లలో మొత్తం 600 కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌ నగరం ఆదర్శంగా ఉండేలా కార్యక్రమం నిర్వహించాలని అధికారులను కోరారు. ప్రజా స్వామ్యంలో అధికారం మారడం సహజమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రేట్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిహెచ్‌ఎంసి నుండి కొత్త ప్రభుత్వానికి అన్ని విషయాలలో పూర్తి సహకారం ఉంటుందని, ప్రజా పాలన మంచి కార్యక్రమం అయినందున పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలని అన్నారు. అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్‌ వార్డు కార్పొరేటర్‌  విజయారెడ్డి మాట్లాడుతూ… ప్రతి దరఖాస్తుకు రేషన్‌ కార్డు ముఖ్యం కాబట్టి రేషన్‌ కార్డుల జారీ పై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో అందరూ భాగస్వాములై సహకరించాలని కోరారు.

ఖైరతాబాద్‌ శాసనసభ్యులు దానం నాగేందర్‌ మాట్లాడుతూ…  ఆరు గ్యారెంటీల అమలును 100 రోజుల్లో పూర్తి చేయాలని అభయహస్తం దరఖాస్తు లో రేషన్‌ కార్డు లేదని గత ప్రభుత్వ కాలంలో గృహలక్ష్మి పథకం కింద 3000 మందికి మూడు లక్షలు చొప్పున మంజూరు కాగా ఎలక్షన్‌ కోడ్‌ ఉన్నందున లబ్ధిదారులకు చెక్కులను అందించలేక పోయినట్లు ఈ పథకం కింద ప్రభుత్వం రెండు లక్షలు అదనంగా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన మంత్రిని కోరారు. బీసీ మైనార్టీ బంద్‌ క్రింద  మంజూరు అయిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాని అట్టి చెక్కులు జిల్లా కలెక్టర్‌ వద్ద ఉన్నాయని ఎన్నికల కోడ్‌ ఉన్నందున పంపిణీ చేయలేక పోయినట్లు వాటిని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ని కోరారు. నగరం లో 1500 స్లమ్స్‌ లను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి కౌంటర్‌ లను పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి వెంట జోనల్‌ కమిషనర్‌  వెంకటేష్‌ దోత్రె, కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్‌ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య, డిప్యూటీ కమిషనర్‌ ప్రశాంతి, ఎస్‌.ఈ  రత్నాకర్‌, ఈ.ఈ విజయసాయిరెడ్డి, ఏ ఎం అండ్‌ హెచ్‌.ఓ తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో అందరూ భాగస్వాములై సహకరించాలని కోరారు.

Leave a Reply