ఒంటి బడులు వచ్చేశాయి
ఆనందం తెచ్చేశాయి
సాహసాలు చేసే చిచ్చర పిడుగులు
ప్రమాదాల్ని ఎరగని అమాయక పిల్లలు
ఆటలు పాటల్లో మునిగి తేలతారు
మిట్ట మధ్యాహ్నం ఈత ఈదేస్తారు
దాగుడు మూతలు, దొంగ పోలీస్
కికెట్, కేరం బోర్డు, చెస్ ఏ ఆట అయితేనే
ఎండా కొండా జానేదేవ్
చెమటలు కక్కేస్తారు
చెమట దుర్గందం లెక్క చేయరు
సంకెళ్ళు తెంచేస్తారు
స్వేచ్ఛా విహాంగులు అయపోతారు
కల్లా కపటం ఎరుగని వారు
స్వచ్చ మనస్కులవారు
వదిలేయండి వాళ్ళను
ఒత్తిడి నుంచి విముక్తి కల్గించండి
పెద్దల్లారా మీరు పసిపాపలు అయిపోండి
ఆనందం పొందండి
– గాదిరాజు రంగరాజు
8790122275