Take a fresh look at your lifestyle.

‘ప్రజా పాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలోని వివేకానంద నగర్‌ డివిజన్‌ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌ కాలనీ లో గల  ఫంక్షన్‌ హాల్‌ లో, ఆల్విన్‌ కాలనీ దత్తాత్రేయ కాలనీ, ఆల్విన్‌ కాలనీ పేస్‌ 2కమిటీ హాల్‌ లలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాల ను  రంగారెడ్డి జిల్లా బిఎండబ్ల్యూఓ అధికారి  నవీన్‌ రెడ్డి ,   కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌, మాధవరం రోజాదేవి రంగరావుల  తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ  మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడలని, దరఖాస్తు చేసుకోదలచిన వారు తమ డివిజన్లలో ఏర్పాటుచేసిన కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్ల లో వారికి కావలసిన  పథకానికి సంబంధించినవి దరఖాస్తు ద్వారా అక్కడికక్కడే అధికారులకు ఇచ్చి రసీదు పొందాలనిసూచించారు.

ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన ప్రజాపాలన 28.12.23 నుండి 06.1. 24 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, దీనిలో భాగంగా పథకాలైన మహాలక్ష్మి(గ్యాస్‌ సిలెండర్‌-500 మరియు  2500 నగదు), గృహ జ్యోతి (200 యూనిట్ల కరెంటు రాయితీ), ఇందిరమ్మ ఇల్లు, చేయూత(ఫించన్లు) వంటి పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోదలచినవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒకే దరఖాస్తు ద్వారా తమ యొక్క పథకమును అప్లై చేసుకుని మీ యొక్క స్థానిక ప్రాంతాల్లో నియమించబడిన కార్యాలయాల్లో ఇవ్వాలని సూచించారు అలాగే… ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కలిపించాలని, మంచినీరు అందించాలని శాంతి భద్రతలు విషయంలో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఈ కార్యక్రమం పై విస్తృతంగా  అవగహన కలిపించాలని, అర్హులైన వారందరికీ ,నిజమైన లబ్ధిదారులకు ,పార్టీలకతీతంగా  సంక్షేమ పథకాలు అందేలా చూడలసిన బాధ్యత  అందరి పై ఉంది అని ఎమ్మెల్యే గాంధీ  తెలియచేసారు.

ప్రతి డివిజన్‌ కి నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగినది అని ,స్ర్రీలకు ,పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అని ,అవసరమైతే జనాభా ప్రాతిపదికన ఎక్కువ జనసాంద్రత ఉన్న చోట మరిన్ని  కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు అధికారులకు సూచించారు.నిజమైన లబ్ధిదా రులకు పథకాలు అందేలా చూడా లన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి అధికారులు రaాన్సీ , మాజీ కార్పొరేటర్‌  మాధవరం రంగరావు వివేకానంద నగర్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి,బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద  భాస్కర్‌ రావు, దొడ్ల రామకృష్ణ గౌడ్‌, అనిల్‌ రెడ్డి, పాండుగౌడ్‌, కాశీనాథ్‌ యాదవ్‌, గుడ్ల శ్రీనివాస్‌, చిన్నోళ్ల శ్రీనివాస్‌, పుట్టం దేవి, లక్ష్మమ్మ, నాయినేని చంద్రకాంత్‌ రావు ,హరినాథ్‌, ఆంజనేయులు,శ్రావణి రెడ్డి, బాబు,లింగయ్య, లక్ష్మీ నర్సయ్య, చంద్రమోహన్‌ సాగర్‌,విద్యాసాగర్‌, సంపత్‌, ప్రవీణ్‌, నరేష్‌ ,శంకర్‌ గౌడ్‌ ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply