Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

* కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి
* కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది..
* అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం..
* కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి
* కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ

కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 : ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని..  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు. కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మెడిగడ్డ కుంగిందని కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ  వ్యాఖ్యానించారు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన సభలో  రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ధరణి పేరుతో వేల ఎకరాలు కేసీఆరే ఆక్రమించుకున్నారు. తెలంగాణలో 8లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారు… కేసీఆర్ గారూ.. మీరు వెళుతున్న రోడ్డు కాంగ్రెస్ వేసింది… మీరు చదువుకున్న స్కూల్ నిర్మించింది కాంగ్రెస్.. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్…హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయంటే అందుకు కారణం కాంగ్రెస్.. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చేస్తాం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం.. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం.  రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం.  రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం.  రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తాం.. అధికారంలోకి రాగానే రైతులకు 24గంటల ఉచిత కరెంటు అందిస్తాం.. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఆర్ధిక సాయం అందిస్తాం… నిన్న సాయంత్రం నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నా.. చదువుకునే యువతకు విద్యా భరోసా ద్వారా రూ.5లక్షలు సాయం అందిస్తాం.. ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అందుబాటులోకి తెస్తాం.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది..తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని రాహుల్ గాంధీ కోరారు.

Leave a Reply