Take a fresh look at your lifestyle.

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట మున్సిపల్‌ ‌కౌన్సిలర్‌ ‌దీప్తి నాగరాజు తండ్రి నాగేంద్రం ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌ ‌రావు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబీకులను ఓదార్చారు. మండల కేంద్రమైన చిన్నకోడూర్‌లో ఎంపిటిసిల ఫోరమ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ‌తల్లి ఇటీవల మృతి చెందారు. శ్రీనివాస్‌ను మంత్రి పరామర్శించారు. అదే విధంగా మండల పరిధిలోని గంగాపూర్‌ ‌గ్రామానికి చెందిన ఆత్మ కమిటీ ప్రతినిధి గాంధారి సరోజన భర్త మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.

గాంధారి సరోజన కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబీకులను మంత్రి ఓదార్చారు. మంత్రి వెంట సుడా చైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, చిన్నకోడూర్‌ ఎం‌పిపి మాణిక్‌ ‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ ఇతర ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply