రైస్ మిల్లులకు ఖరీఫ్ కాలానికి కేటాయించిన లెవీ రైస్ బియ్యం వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.శుక్రవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్ అధికారులతో పాటుగా జిల్లా రైస్ మిల్లుల యాజమానులతో కలెక్టర్ లేవి బియ్యం సరఫరా పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో ఖరీఫ్ కాలంలో కేటాయించిన లేవి నిర్దేశించిన ప్రకారంగా యే ఒక్క రైస్ మిల్లుల తనకు కేటాయించిన లక్ష్యం మేరకు సివిల్ సప్లై కార్పొరేషన్‌కు గాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదని ఆయా మిల్లుల కు కేటాయించిన రా రైస్, బాయిల్ట్ రైస్ ఇప్పటి అందజేయక పోవడంతో ఈ విషయం లో ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యం లో లక్ష్యం మేరకు తొందరగా అందజేయలని కోరారు.
ఇంకా మిగిలిన 32 923 మెట్రిక్ టన్నుల రా రైస్ ను సివిల్ సప్లై కార్పొరేషన్ ఎఫ్‌సిఐకి డెలివరీ చేయాల్సి ఉందని అదే విధంగా ఇంకా మిగిలిన 7680 మెట్రిక్ టన్నుల బయిల్డ్ రైస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అందజేయాల్సి ఉందని అన్నారు. రైస్ మిల్లులు యాజమానులు కేటాయించిన ప్రకారంగా ఇంకా మిగిలిపోయిన రా , బాయిల్దు రైస్వెంటనే అందజేయాలని ఆదేశించారు రోజు వారి డెలివరీ వివరాలను అందజేయాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా సప్లయ్ అధికారి వసంత లక్ష్మి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కృష్ణవేణి, జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్య•••, కార్యదర్శి యాజమానులు తదితరులు పాల్గొన్నారు.