Take a fresh look at your lifestyle.

ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన బీజేపీ

డిగ్రీలు, పీజీ, రీసెర్చ్‌ చేసిన యువతకు ఏ చిన్నపాటి ఉద్యోగమైన చేయడానికి సిద్దపడినా మార్కెట్‌లో ఉపాధి లభించని స్థితి నెలకొంది.  కార్మికశక్తిలో ఉపాధి పొందుతున్న వారు (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌) దేశంలో 2016-17లో 46.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరాల్లో  శ్రమశక్తి ఉపాధి పట్టణ ప్రాంతాల్లో 44.7 శాతం నుండి 37.5 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం నుండి 40.5 శాతానికి తగ్గిపోయింది. ఇదే సంవత్సరాల్లో మహిళల ఉపాధి 14.9 శాతం నుండి 8.7కు, పట్టణాల్లో 14.6 నుండి 6.9కి, గ్రామీణ ప్రాంతాల్లో 15.9 నుండి 9.7 శాతానికి పడిపోయిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక తెలిపింది. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న నిరుద్యోగులు పట్టణాల్లో 45.98 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 43.79 శాతం మంది ఉన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక విధానం కంటే మతతత్వ ఎజెండా ప్రధాన అంశం.  

వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుత పదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత గొప్పగా  ఏమీ లేవని ప్రజలను కుంటున్నారు, మోదీ  గొప్పగా ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్‌, సంచాయిని యోజన, గరీబ్‌ కల్యాణ్‌  యోజన,  మేక్‌-ఇన్‌-ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి పథకాలు ఏవి యువత ఉపాధికి తోడ్పడలేదు. పైగా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని ఇటీవల అధికారిక సర్వేలు పచ్చిగా చెప్తున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ గెలిస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ అటకెక్కి, మోదీ  నిరుద్యోగ సైన్యంలో 83 శాతం మంది యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ), ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డి) మార్చి 26న వెల్లడిరచాయి.  ఐఎల్‌ఓ మరియు ఐహెచ్డి సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్‌ రిపోర్ట్‌ 2024’ ను ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఈఎ) వి. అనంత నాగేశ్వరన్‌ మార్చి 26న విడుదల చేశారు. బీజేపీ  ఏలుబడిలో దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది.

ఆందోళనకరంగా 25 ఏళ్ళ లోపు నూతన గ్రాడ్యుయేట్లలో 45 శాతం మంది నిరుద్యోగులుగా వున్నారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ది ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకటించింది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు కాకపోగా 2017-22 మధ్య రెండు కోట్ల మంది మహిళా కార్మికులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయారు.   2023-24 స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) 2019-20 కంటే దాదాపు 18 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ గణాంకాలు అంచనా వేస్తూంటే ఉపాధి అవకాశాలు మాత్రం గత ఐదేళ్ళలో ఎన్నడూ లేనంతగా ‘సున్నా’ వృద్ధిని  సూచిస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది.  2023-24 లో నిరుద్యోగానికి కూడా కులం, లింగం, ఆర్థిక వివక్ష ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటి ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2023’ రిపోర్టు నిరుద్యోగం లోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.

డిగ్రీలు, పీజీ, రీసెర్చ్‌ చేసిన యువతకు ఏ చిన్నపాటి ఉద్యోగమైన చేయడానికి సిద్దపడినా మార్కెట్‌లో ఉపాధి లభించని స్థితి నెలకొంది.  కార్మికశక్తిలో ఉపాధి పొందుతున్న వారు (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌) దేశంలో 2016-17లో 46.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరాల్లో  శ్రమశక్తి ఉపాధి పట్టణ ప్రాంతాల్లో 44.7 శాతం నుండి 37.5 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం నుండి 40.5 శాతానికి తగ్గిపోయింది. ఇదే సంవత్సరాల్లో మహిళల ఉపాధి 14.9 శాతం నుండి 8.7కు, పట్టణాల్లో 14.6 నుండి 6.9కి, గ్రామీణ ప్రాంతాల్లో 15.9 నుండి 9.7 శాతానికి పడిపోయిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక తెలిపింది. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న నిరుద్యోగులు పట్టణాల్లో 45.98 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 43.79 శాతం మంది ఉన్నారు.  బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక విధానం కంటే మతతత్వ ఎజెండా ప్రధాన అంశం. గత పది సంవత్సరాల పాలన కాలంలో ప్రజల మధ్య మత విభజన తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.   కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు, దిల్లీ, మణిపూర్‌లలో అల్లర్లు, ఉమ్మడి పౌరస్మృతి, అయోధ్యలో రామాలయం ఇలా అన్నింటిలోనూ మతతత్వ ఎజెండాను అమలు చేశారు.

కేవలం మతతత్వ విధానాలు అమలు చేస్తే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు బిజెపిని బలపరచవు. అందుకే ఆర్థిక విధానాల్లో ఈ కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశ యువత, భవిత కంటే కార్పొరేట్‌ కంపెనీల సేవలో పునీతమవుతున్నారు. లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు. వీటన్నింటి గురించి ఆలోచించకుండా  యువత దృష్టిని మళ్ళించడానికి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు.  ఎన్నికల  ముందు  విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి , నీరు, పర్యావరణం, హక్కులు, జీవనశైలి, సంస్కృతి, కళలు అన్నీ తుచ్చమైనవి. వార్త పత్రికలూ, ప్రచార సాధనాలు  ఎన్నికలకు ఆరు నెలలు ముందుగా ప్రజలకు సంబంధించిన అంశాలను పక్కన పెట్టి పనికిమాలిన వార్తలకు ప్రాధాన్యమిస్తుంటారు.

పది సంవత్సరాల క్రితం ఇతర దేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి  ఒక్కో మనిషికి 15 లక్షలు ఇస్తానన్న సంగతి బీజేపీ మరచిపోయింది. సమాన విద్యావకాశాలు లేని నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి  కాషాయీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణకు పెద్ద పీట వేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పరిశోధన సంస్థను స్థాపించింది లేదు, కేంద్ర విశ్వవిద్యాలయాలలో, పేరెన్నిక గల సంస్థలలో  ఉద్యోగ క్షీణత  నలభై  శాతం దాటింది.   రాజ్యాంగం నుండి లౌకికవాదాన్ని తొలగిస్తారన్న భయాన్ని తొలగించలేదు.  ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడం,   67 ఏళ్ళ అప్పులు 55 లక్షల కోట్లు ఐతే మోదీ  ఒక్కరే చేసిన అప్పులు 80 లక్షల కోట్లు.  పెట్రోల్‌ ధర రూపంలో దోచుకున్న 26 లక్షల కోట్లు గురించి, ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా  వసూలు చేసిన 6900 కోట్ల గురించి గోప్యత పాటిస్తారు.   వ్యాపారస్తులు, కార్పొరేట్లు ఎగవేస్తున్న   ఆదాయపు పన్ను గురించి చట్టసభలలో  చర్చలేదు.    కొరోనా ప్యాకేజీ 20 లక్షల కోట్లు, పీఎం కేర్స్‌ ఫండ్‌ కు వచ్చిన విరాళాల గురించి ఎనిమిది వేల కోట్లతో  విమానానికి తగలేయడం, కార్పొరేటు ప్రైవేటు హాస్పిటల్స్‌  కొరోనా టైంలో 6 లక్షల కోట్ల దోపిడి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.   మూతపడుతున్న లక్షల ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఏనాడూ చింతించలేదు.

హిడెన్‌ బర్గ్‌  రిపోర్టు  ద్వారా  గత సంవత్సరం స్టాక్‌ మార్కెట్లో సామాన్య మదుపరుల ఆస్తి  లక్షల కోట్లు ఆవిరైపోయిన పట్టించుకోలేదు.  ఇరవై లక్షల కోట్లు కార్పొరేట్‌ ఎగవేత దారుల రుణాలను మాఫీ చేయడం, అదానీ ఆస్తులు  పది సంవత్సరాలలో  26 రెట్లు పెరగడం,   కొరోనా సమయం లో అంబానీ ఆస్తి గంటకు 90 కోట్లు పెరగడం చూస్తుంటే  మోదీ  ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడో   అర్థం అవుతుంది.   గిట్టుబాటు ధరలు లేక ప్రతిరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న చీమ కుట్టినట్లు లేకుండా రోజు రాష్ట్రాల వెంట తిరుగుతూ  పూటకొక డ్రెస్‌ మార్చి   400 కి పైగా సీట్లు వచ్చేందుకు మాకు వోట్లు వేయండి అని అభ్యర్థిస్తున్నారు.  మతతత్వ విద్వేషాలను రెచ్చగొట్టడానికి బదులు వెలుగులోకి వస్తున్న పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుగొనాలని విద్యావేత్తలు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు . నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యమించడమంటే కార్పొరేట్‌, మతతత్వ ఎజెండాల సమ్మళితంగా ఉన్న బిజెపి ఓడిరచడానికి సిద్ధం కావడమే తక్షణ పరిష్కారం.

డా. ముచ్చుకోట సురేష్‌బాబు,
అధ్యక్షులు,  ప్రజా సైన్స్‌ వేదిక.

Leave a Reply