Take a fresh look at your lifestyle.

కరోనా ప్రభావం ముంబాయిలో మందులు, మాస్కుల కొరత

“కరోనా వ్యాప్తితో మాస్క్‌లకు డిమాండ్‌ ‌పెరిగింది. మార్చి ఆరంభం నుంచి భారత్‌ ‌లో మాస్క్‌లకు డిమాండ్‌ ‌పెరగడంతో చాలా దుకాణాల్లో స్టాకు లేదనే బోర్డు పెడుతున్నారు. అలాగే, కోరనా నుంచి రక్షణ కోసం ఇతర సాధనాలు, ఉపకరణాల విషయంలోనూ స్టాకులేదనే సమాధానం దుకాణ యజమానులనుంచి వస్తోంది. మాస్క్ ‌లు, ఇతర ఉపకరణాల ను ఎనిమిది రెట్లు ఎక్కువగా అమ్ముతున్నందుకు ఘజియాబాద్‌ ‌లో కొన్ని దుకాణాలను డ్రగ్‌ ‌కంట్రోల్‌ అధికారులు మూసివేయించారు.”

కరోనా వైరస్‌ ‌కారణంగా ముంబాయి లోని ఇంగ్లీషు మందుల షాపుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. కరోనా వైరస్‌ ‌సోకకుండా ముందస్తు మందుల కోసం ప్రజలు మందుల షాపులకు క్యూ కడుతున్నారు. అయితే, స్టాకు లేదనే బోర్టు ప్రతి షాపు వద్ద ప్రజలకు దర్శనం ఇస్తోంది. సోమవారం మధ్యాహ్న మాధురి జేథీ అమె స్నేహితురాళ్ళు ముంబాయిలోని బాంద్రాలో తమ కూరగాయల దుకాణం వద్ద కొనుగోలుదారుల సంభాషణల్లో ఒక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.చేతులు తుడుచుకునే గుడ్డలు, మాస్క్‌ల కోసంజనం మందుల దుకాణాల వద్దకు వస్తున్నారనీ,అవి లేవని దుకాణదారులు చెబుతున్నారనీ, పాఠశాలల్లో, కళా శాలల్లో మూతికి మాస్క్ ‌లు కట్టుకోనిదే రావద్దని విద్యార్ధినీ,విద్యార్థులకు ఆంక్షలు విధిస్తున్నారన్నది వారి సంభాషణల సారాంశం. జేథీ అనే కూరగాయల వ్యాపారినికి 45 ఏళ్ళు ఉంటాయి ఆమె శానిటరీ నేప్‌ ‌కిన్స్, ‌చేతులు తుడుచుకునే గుడ్డల గురించి ఎప్పుడూ వినలేదు. కరోనా వ్యాప్తి జరిగిన తర్వాతా వీటి పేర్లు ప్రాచుర్యాన్ని పొందాయి. ఆమె మనవలు పొరుగున ఉన్న బస్తీలో కేథలిక్‌ ‌స్కూలులో చదువుకుంటున్నారు. వారిని స్కూలు యజమానులు,లేదా నిర్వాహకులు ఈ మాదిరి గుడ్డలను తెమ్మనమని ఎప్పుడూ అడగలేదు కానీ ఇప్పుడు తప్పలేదు.

కరోనాను అధికారికంగా కోవిడ్‌ -19 అం‌టున్నారు. ఆ వ్యాధి భారత్‌లో 60 మందికి సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు ఎక్కువగా కేరళ, ఢిల్లీ, రాజస్థాన్‌, ‌తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, ‌జమ్ము, కాశ్మీర్‌ ‌లలో నమోదు అయ్యాయి. కరోనా 60 దేశాలను గడగడలాడిస్తోంది.లక్ష మందికి పైగా ఈ వ్యాధి సోకింది. నాలుగువేల మంది మరణించారు. కరోనా వ్యాప్తితో మాస్క్ ‌లకు డిమాండ్‌ ‌పెరిగింది. మార్చి ఆరంభం నుంచి భారత్‌ ‌లో మాస్క్ ‌ల డిమాండ్‌ ‌పెరగడంతో చాలా దుకాణాల్లో స్టాకు లేదనే బోర్డు పెడుతున్నారు. అలాగే, కోరనా నుంచి రక్షణ కోసం ఇతర సాధనాలు, ఉపకరణాల విషయంలోనూ స్టాకు లేదనే సమాధానం దుకాణ యజమానులనుంచి వస్తోంది. మాస్క్ ‌లు, ఇతర ఉపకరణాల ను ఎనిమిది రెట్లు ఎక్కువగా అమ్ముతున్నందుకు ఘజియాబాద్‌ ‌లో కొన్ని దుకాణాలను డ్రగ్‌ ‌కంట్రోల్‌ అధికారులు మూసివేయించారు. ఢిల్లీలో కూడా మందుల షాపులపై దాడులు జరిగాయి ఢిల్లీలో గతవారం చివరలో డ్రగ్‌ ‌కంట్రోల్‌ అధికారులు మందుల దుకాణాలపై దాడులు జరిపి 2,500 మాస్క్ ‌లను, చేతులు శుభ్రం చేసుకునే లోషన్‌ ‌బాటిల్స్ 2,500 ‌పైగా స్వాధీనం చేసుకున్నారు. ముంబాయి, కోల్‌ ‌కతాలలో అటువంటి దాడులు ఏవీ నిర్వహించకపోయినా,మందుల దుకాణాల్లో మందుల కొరత కొనసాగుతోంది.అంధేరీ శివారులో భరత్‌ ‌జైన్‌ అనే మందుల దుకాణం యజమాని కొద్ది రోజుల్లో మందుల స్టాకు వస్తుందంటూ కస్టమర్లకు ఓపికగా చెబుతున్నారు.

అయితే కొత్త స్టాకు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని కొన్ని దుకాణాల యజమానులు చెబుతున్నారు.శాంతా క్రజ్‌ ‌లోని గ్లోరియస్‌ ‌ఫార్మసీ చేతులు కడుక్కునే లోషన్లలో నాసిరకం విక్రయిస్తున్నారు. లోషన్‌ ‌బాటిల్స్ ‌ను పంపిణాదారులు దుకాణ దారులకు సీసా ఒక్కింటికి మూడు రూపాయిల వంతున విక్రయిస్తున్నారు.ఆ సీసాను ఒక్కొక్క దానిని 18 రూపాయిలకు దుకాణదారులు విక్రయిస్తున్నారు. అంధేరీలో మందుల విక్రయ దారుల సంఘం ప్రతినిధి ఒకరు స్క్రోల్‌ ‌ప్రతినిధితో మాట్లాడుతూ, చేతులు కడుక్కునే లోషన్ల గిరాకీని ఆధారంగా చేసుకుని కొందరు దుకాణాల యజమానులు సొమ్ము చేసుకుంటున్న మాట నిజమేననీ, డ్రగ్‌ ‌కంట్రోల్‌ అధికారుల పర్యవేక్షణ కరువవడం వల్లనే దుకాణాదారులు ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారని మందుల విక్రయదారుల సంఘం ప్రతినిధి రోపించారు కాగా, మాంసం తినడం వల్ల కరోనా వ్యాపిస్తోందన్న వా దాన్ని కేమ్లే ఉద్యోగుల సంఘం ఖండించింది. ఇలాంటి వదంతుల వల్ల వ్యాపారాలు దెబ్బతుంటున్నాయని కామ్లే ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. ప్రజలు పుకార్లను విశ్వసించవద్దని సంఘం విజ్ఞప్తి చేసింది. భయాందోళనలు తగదని మందు దుకాణాల యజమానుల సంఘం ధైర్యం చెప్పింది.
– ద స్క్రోల్‌.ఇన్‌ ‌సౌజన్యంతో

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy