Take a fresh look at your lifestyle.

చరిత్రను వక్రీకరించే ప్రయత్నం..‘రజాకార్‌’

 సినిమాలో కమ్యూనిస్టుల పాత్ర ఎక్కడ…?

తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో కమ్యూ నిస్టుల నేతృత్వంలో జరిగిన అతిపెద్ద తిరుగుబాటు. ఇది 1946 నుండి 1951 వరకు అప్పటి హైదరాబాద్‌లో భాగమైన తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణలో జరిగింది. బ్రిటీష్‌ వలస పాలనలో, భారతదేశం ప్రత్యక్ష బ్రిటిష్‌ పాలనలో లేని వందలాది ప్రాంతాలను కలిగి ఉంది మరియు బ్రిటిష్‌ వారితో అనుబంధ కూటమిలో కొనసాగడానికి సామంత రాష్ట్రాలు అనుమతించబడ్డాయి.నిజాం అనే బిరుదుతో చక్రవర్తి పాలించిన హైదరాబాద్‌ అటువంటి సంస్థానాలలో ఒకటి. కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాటం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిరది. నిజామ్‌ నవాబు పరిపాలన చివరి రోజుల్లో ప్రజలు నిత్యనరకం అనుభవించారు.  తరతరాల బానిసత్వానికి, నిజాం, రజాకార్ల పాలన నిరంకుశత్వానికి నిరసనగా సాగించిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. మట్టి మనుషులను సైతం మహాయోధులుగా మార్చిన ఘనత సాయుధ పోరాటానిది. ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి పోరాడిన యోధులు ఎందరో ఉన్నారు.  ఎటు పోయి హిందూ మతం చుట్టే తిప్పినారు, ఎలక్షన్‌ స్టంట్‌ లో భాగం అనుకుంటా… మన పరాయి పాలనలో మన వాళ్ళని అనిచివేశారు, అని ప్రగల్బలు పలికినారు,, మరి మీరు చేసింది ఏంటి, అసలు చరిత్రని తొక్కి, మీరు రాసుకున్న కథనే నిజం అంటే ఎవ్వరు నమ్ముతారు.. చరిత్రని వక్రికరించలేరు.  అసలు పోరాటం చేసిన ఆ యోధుల గురుంచి ఎక్కడ ప్రస్తావించారు.

 

ఆ ప్రాంతాలను ఎందుకు చూపించలేదు? రజాకార్‌ సినిమాతో అమరవీరులకు అవమానం జరిగింది  భూమి, భుక్తి, విముక్తి కోసం నిజాం రాజుపై సాయుధ పోరాటం చేసి కొన్నివేల మందికిపైగా ప్రాణాలు అర్పించిన రైతుకూలీల త్యాగాలను అవమానించారు, శుక్రవారం విడుదల అయిన సినిమాలో తెలంగాణ చరిత్రను పూర్తిగా వక్రీకరించి, మతం రంగు పూసే ప్రయత్నం చేశారు.   భూమి, బుక్తి, విముక్తి, వెట్టిచాకిరికి, వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్టుల పాత్ర ను మరిచారు. అన్యాయమైన పన్నులు, వెట్టి ,బలవంతపు కూలీలు, రద్దు చేయాలని, భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు అందించాలనే డిమాండ్లతో పోరాటం ప్రారంభమైంది. కమ్యూనిస్టు సమీకరణ మరింత బలపడటంతో, రజాకార్లు మరియు పోలీసులచే కమ్యూనిస్టులపై అణచివేత, హింస మరియు హత్యలు తీవ్రమయ్యాయి, ఇది సాయుధ ప్రతిఘటనకు దారితీసింది. ఈ పోరాటం ఫలితంగా రైతులకు లక్ష ఎకరాల భూమి పంపిణీ జరిగింది. బలవంతపు పనిని రద్దు చేశారు, కార్మికుల రోజువారీ వేతనం పెంచారు మరియు కనీస వేతనం అమలు చేయబడిరది, కేవలం కమ్యూనిస్టుల పోరాట  ఫలితంగానే. ఈ పోరాటంలో   దొడ్డి కొమురయ్య ,బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి,  పుచ్చలపల్లి సుందరయ్య, ముఖ్దుం మొయినుద్దీన్‌, ధర్మ బిక్షం, మల్లు స్వరాజ్యం బెల్లంకొండ సతయ్య.. అనేక కమ్యునిస్టులు పాల్గొన్నారు…తెలంగాణ సాయుధ పోరాటం, నా అనుభవాలు అనే గ్రంథంలో వారి పోరాట పటిమను తెలియజేశారు పుచ్చలపల్లి సుందరయ్య.
-జాజుల దినేష్‌, సామాజిక విశ్లేషకులు,
 పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌
9666238266

Leave a Reply