Take a fresh look at your lifestyle.

విద్యార్ధులకు అల్పాహారం

Breakfast for students

గరిడేపల్లి: మండల పరిధిలోని పొనుగోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం జోగు సరోజిని పిచ్చిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దాత జోగు అరవిందరెడ్డి సహకారంతో పదవ తరగతి విద్యార్ధులకు అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ‌సరోజిని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాంసైదులు, చిటికెల అరుణ, పోరెడ్డి శ్రీరాంరెడ్డి, కందిబండ శ్రీనివాసరావు, సుందర్‌రావు, సుందరి కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

పాఠశాలలో కేక్‌ ‌కటింగ్‌….
‌గరిడేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాకమిటి చైర్మన్‌ ‌కానుగు నగేష్‌ ‌గౌడ్‌ ఆధ్వర్యంలో కేక్‌ ‌కట్‌ ‌చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Tags: cake cutting in school, garidepalli, breakfast, students jogu sarojini pichi reddy

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply