- సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారిన పరిస్థితులు
- ఇరు దేశాల్లో 4,500కు పైగా భూకంప మృతుల సంఖ్య
- భూకంప ధాటికి కకావికలం…సిరియాలో శిథిలాల కిందే చిన్నారికి జన్మ..తల్లి మృతి
- టర్కీకి బయలుదేరిన భారత్ సహాయక బృందాలు
భూకంప ధాటికి కకావికలం…సిరియాలో శిథిలాల కిందే చిన్నారికి జన్మ..తల్లి మృతి
ప్రకృతి ప్రకోపంతో టర్కీ, సిరియా దేశాల్లో రక్తమోడుతోంది. ఓవైపు పుట్టుక అదే సమయంలో మరోవైపు మరణం సంభవించింది. శిథిలాల కిందే బిడ్డను ప్రసవించి కన్నుమూసిందో కన్నతల్లి. టర్కీ, సిరియాలో ఎటు చూసినా కుప్ప కూలిన భవనాలు.. శిధిలాల మధ్య అహకారాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్న క్రమంలో సిరియా అలెప్పోలో ఓ తల్లి బిడ్డను ప్రసవించింది. అదీ శిథిలాల కిందే..తల్లి ఓ పండంటి బిడ్డను ప్రసవించింది. అయితే దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే చిన్నారిని కనులారా చూడక ముందే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పసి బిడ్డకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
టర్కీకి బయలుదేరిన భారత్ సహాయక బృందాలు
వరుసగా సంభవించిన మూడు భూకంపాల వల్ల టర్కీ తీవ్రంగా నష్టపోయిన క్రమంలో టర్కీని ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఘజియాబాద్‌లోని హిండోన్ వైమానిక స్థావరం నుంచి ఈ సహాయక బృందాలు బయల్దేరాయి. ఆపదలో చిక్కుకున్న టర్కీకి భారత దేశం తక్షణం ఆపన్న హస్తం అందజేసింది. సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అవి భారత వైమానిక దళ విమానంలో బయల్దేరాయి. నిపుణులైన జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు, అత్యంత నైపుణ్యంగల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్‌డ్ డ్రిల్లింగ్ ఎక్విప్‌మెంట్, సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు వీటిలో ఉన్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంలో మహిళలు కూడా ఉన్నారు.