Take a fresh look at your lifestyle.

కనీస సౌకర్యాలను కల్పించాలి

సూర్యాపేట(తుంగతుర్తి), మే 2, ప్రజాతంత్ర ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అయిన మంచినీరు, మాస్క్‌లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్‌ అన్నారు. శనివారం నూతన్‌కల్‌ ‌మండల కేంద్రంలో ప్రభుత్వ మహిళ సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించడం, రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారని, నిర్వాహకులు తేమ, తాలు ఉందని తరుగు తీస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఇట్టి విషయంపై ఎమ్మార్వోతో మాట్లాడం జరిగిందని అన్నారు. అనంతరం రైతులకు, హమాలీలకు మాస్క్‌లు, శానిటైజర్ల అందజేసి వారికి కరోనా వైరస్‌ ‌ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తను వివరించారు. అలాగే కాంటాలు వేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని, రైతులకు స్లిప్పులను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్‌, ‌సర్పంచ్‌ ‌కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి, మండల పిఎసిఎస్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌, ‌మండల కాంగ్రెస్‌ ‌నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!