Take a fresh look at your lifestyle.

జన జీవితాల గోప్యతకు గండం

‘‘‌విద్యార్థులలో మొబైల్‌ ‌వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్నివేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా మొబైల్‌ ‌ఛాటింగే తప్ప మరో ధ్యాస లేదు. సెల్ఫీల మోజులో  సభ్యతకు తిలోదకాలివ్వడం దారుణం.’’

టెక్నాలజీ  మంచితో పాటు చెడు ఫలితాలను కూడా అందిస్తున్నది. ముఖ్యంగా  మొబైల్‌ ‌ఫోన్లు విస్తృతంగా వినియోగం లోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ దుర్వినియోగం కూడా పెరిగింది. కంప్యూటర్లను వాడే వారు కూడా అరచేతిలో ఇమిడిపోయే మొబైల్‌ ‌ఫోన్లకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పెరిగిన ఇంటర్నెట్‌ ‌వేగం కూడా సాంకేతిక పరిజ్ఞానం విరివిగా వాడడానికి  దోహదం చేస్తున్నది.  ప్రపంచంలో ఎలాంటి ఆవిష్కరణలు జరిగినా అవి ఇప్పటి వరకూ మానవ జీవితం సౌకర్య వంతం కావడానికి ఉపయోగ పడ్డాయి. ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ ‌పరికరాలు జనబా హుళ్యానికి అందుబాటులోకి వచ్చి, జన జీవన విధానంలో ఒక భాగమై, పని చేసే విధానంలో అనేక మార్పులు తెచ్చాయి. వైజ్ఞానిక శాస్త్ర ఫలితాలు మానవ ఆరోగ్యం పై కూడా విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి.వ్యాధుల నివారణ కోసం మాత్రమే కాకుండా, నూతన వ్యాధుల పుట్టుకకు కూడా అధునాతన పరికరాలు దోహదం చేస్తున్నాయి.  అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే మైబైల్‌ ‌ఫోన్ల వినియోగం మరొక ఎత్తు.  ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే మనకు తెలిసే పోయే విధంగా అరచేతిలో ప్రపంచం ఇమిడి పోయింది.   సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులకు శ్రీ కారం చుట్టింది. మొబైల్‌ ‌వినియోగం ఎంతగా వ్యాప్తి చెంది, ప్రపంచాన్ని మన కళ్ళెదుట నిలబెట్టిందో, అదే నిష్ఫత్తిలో మానవ సంబంధాలను, విలువలను విధ్వంసం చేసింది. టెక్నాలజీ దుర్వినియోగం వలన మానవ జీవితం అత్యంత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడింది. సోషల్‌ ‌మీడియా పై నియంత్రణ లేకుండా పోయింది. నాలుగు గోడల మధ్య జీవితం నడిరోడ్డుకు ఈడ్చడం జరిగింది.  విలువల విధ్వంసానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం బీజాలు వేసింది. చరవాణి మానవ జీవితాలను చిందర వందర చేసింది.

జీవితమంటే సరదాగా గడిపే క్రీడలాతయారైనది.చదువుకున్న వారు, చదువు కోలేని వారు కూడా సోషల్‌ ‌మీడియాకు బానిసలుగా మారి పోయారు. అసభ్యమైన కంటెంట్‌ ‌కోసం అర్రులు చాసే యువతరం బయలు దేరి సాంఘిక మాధ్యమాలకు ప్రభావితమై, అనేక అరాచకాలకు ఒడిగట్టడం జరుగుతున్నది. అడ్డదిడ్డమైన అడల్ట్ ‌కంటెంట్‌ అడ్డదారుల్లో తొక్కి, విలువల పతనానికి ప్రేరేపిస్తున్నది. సాంఘిక మాధ్యమాలు ఉపాధికి దోహదం చేస్తున్న మాట వాస్తవం. ఇదే సందర్భంలో మానవ నైతిక పతనానికి సోషల్‌ ‌మీడియా ఒక దగ్గర  మార్గం గా మారిపోయింది. అశ్లీలతకు సెన్సార్‌ ‌లేదు. దీనికి అడ్డుకట్ట వేసే నాథుడు లేడు. సోషల్‌ ‌మీడియాపై నిర్దిష్టమైన పర్యవేక్షణ లేదు. డబ్బు కోసం గడ్డి తినే వర్తమానంలో అనేక అడ్డదారులు ఏర్పడ్డాయి. టెక్నాలజీ ఇందుకు విస్తృతంగా దోహదపడుతున్నది. అత్యంత సులభమైన పద్ధతిలో డబ్బు సంపాదనకోసం వెంపర్లాడుతున్నారు.  అసభ్యకరమైన అత్యంత జుగుప్సాకరమైన వీడియోలను సాంఘిక మాధ్యమాల లోకి యూ ట్యూబ్‌ ‌ఛానళ్ళ లోకి చొప్పించి, లైకులు, షేర్లు, సబ్స్కైబ్‌లతో  డబ్బు సంపాదించడం మొదలెట్టారు. సమాజానికి  ఉపయోగపడే పోస్టులను కూడా అర్దం చేసుకోకుండా అప్పుడప్పుడు ఎక్కౌంట్లను సస్షెండ్‌ ‌చేసే ఫేస్‌ ‌బుక్‌ ‌దిగ్గజానికి అసభ్యకరమైన కంటెంట్‌ ‌కనిపించక పోవడందురదృష్టకరం. మంచిని పెంపొందించే వీడియోలకు ఆదరణ కరువైనది.జుగుప్సాకరమైన దృశ్యాలు అత్యంత వేగంగా ప్రజాదరణ పొందడాన్ని చూస్తుంటే చెడు పట్ల ఆకర్షణ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.సమాజం పెడదారి పడుతున్నది.యువతతో పాటు, చిన్న పిల్లలు కూడా సాంఘిక మాధ్యమాల ప్రభావంతో చెడిపోతున్నారు. తెలిసీ, తెలియని బాల్య దశలోనే తప్పుటడుగులు పడుతున్నాయి. చిన్న వయసులోనే చెడిపోయే మార్గాలు ఏర్పడ్డాయి.

అసాంఘిక చర్యలకు ఆలవాలంగా మారుతున్న సాంఘిక మాధ్యమాలను నియంత్రించడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైనది. వీక్షకుల  విచక్షణకే వదిలేసిన పలు రకాల అసభ్యకరమైన సైట్లు మానవ జాతిని విలువల నుండి విముక్తి చేసి, జంతు ప్రవృత్తి ని అలవాటు చేస్తున్నాయి.ప్రపంచాన్ని ఏదో ఉద్దరిస్తున్నట్టుగా సాగుతున్న దరిద్రమైన భావజాలం  మానవ సమాజంలోకి  ప్రవేశించింది. ఫ్రాంక్‌ ‌వీడియోల ప్రహసనం విశృంఖలంగా కొనసాగుతున్నది. ఇందులో ద్వందార్ధ సంభాష ణలతో కూడిన అశ్లీలత యువతను  పాడు చేస్తున్నది. వ్యూవర్‌ ‌షిప్‌ ‌పెంచుకోవడానికి నగ్నత్వాన్ని జనబాహుళ్యంలోకి విచ్చలవిడిగా వదులుతున్నారు. మరికొంత మంది రీల్స్ ‌పేరుతో, పేరడీల పేరుతో గారడీలు చేస్తున్నారు. చివరికి తమ ఇంటి విషయాలను, నట్టింట జరిగే కార్యకలాపాలనుసైతం సోషల్‌ ‌మీడియాలో షేర్‌ ‌చేస్తున్నారు. తమ గొప్ప తనాన్ని చాటి చెప్పడానికి తమ ఇంట్లో ప్రతీ అంగుళాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తూ మోసగాళ్ళకు ఆస్కారం కల్పిస్తున్నారు. ఇప్పటికే సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ ‌ఫామ్‌ ‌పుణ్యంతో కోట్లాది మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం సైబర్‌ ‌నేరగాళ్ళ చేతికి చిక్కింది.దేశవ్యాప్తంగా ఇటీవల సుమారు 67 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా చోరీ జరిగినట్టు సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసుల అంచనా. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ‌కు చెందిన 2 కోట్లమంది, తెలంగాణాకు చెందిన 50 లక్షల మంది వ్యక్తిగత సమాచారం దొంగిలింపబడినట్టు  చెబుతున్నారు. కోట్లాది మంది ప్రజల గోప్యత అమ్మకానికి పెట్టడం అత్యంత దారుణం. వ్యక్తుల ఈ మెయిల్‌, ‌ఫోన్‌ ‌నెంబర్లను, వారి కార్యకలాపాలను, ఆధార్‌ ‌నెంబర్లను,పాన్‌ ‌కార్డు వివరాలను, బ్యాంకు ఎక్కౌంట్లనుసేకరించి, అమ్మాకానికి పెట్టినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి  మొబైల్‌ ‌మరియు కంప్యూటర్లు వినియోగిన్తున్నవారు  మాల్వేర్‌, ‌బోట్నెట్‌ ఇన్‌ ‌ఫెక్షన్ల బారిన పడకుండా యాంటీ వైరస్‌ ‌ను ఏక్టివేట్‌ ‌చేసుకోవాలని ఇటీవల మొబైల్‌ ‌సందేశాలు పంపించింది. ఏది ఏమైనా మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌ ‌మీడియాలో షేర్‌ ‌చేయడం పెద్ద తప్పిదం. ఆధార్‌,‌పాన్‌ ‌కార్డు వంటి వివరాలను, బ్యాంకు వివరాలను గోప్యంగా ఉంచుకోవాలి.  ఈ మధ్య రకరకాల లోన్‌ ‌యాప్లు చికాకు పరుస్తున్నాయి. వివిధ బ్యాంకుల నుంచి మన ప్రమేయం లేకుండా క్రెడిట్‌ ‌కార్డులు పంపుతున్నట్టు,లోన్లు మంజూరైనట్లు  ఇ మెయిల్స్ ‌వస్తున్నాయి. మన ఈ మెయిల్‌ ఐడి వారికి ఎలా తెలుస్తున్నది? మన మొబైల్‌ ‌నెంబర్లు,వాట్సప్‌ ‌నెంబర్లు ఎలా హ్యకర్ల చేతికి చిక్కుతున్నాయో అర్ధం కావడం లేదు. ఎన్నో లింకులు మన మొబైల్‌,ఈ ‌మెయిల్స్ ‌కు వస్తున్నాయి. ఈ లింకులను క్లిక్‌ ‌చేయడం అత్యంత ప్రమాదకరం. వీటి విషయంలో అప్రమత్తత అవసరం.

సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల కారణంగా నేడు సమస్త భూగోళం సాంకేతికంగా మన అరచేతిలో ఇమిడిపోయిన మాట వాస్తవం. దీనివలన కలుగుతున్న ప్రయో జనాలను కాదనలేం.ప్రపంచంలో టెక్నాలజీ వలన కలిగిన సౌకర్యాన్ని విస్మరించలేము. నెలల తరబడి, సంవత్సరాల తరబడి సముద్ర ప్రయాణాలు చేస్తే గాని విదేశాలకు వెళ్లలేని పరిస్థితుల నుండి గంటల్లో, రోజుల్లో విదేశాలను చుట్టేసి రాగలగడం విజ్ఞానం అందించిన అద్భుతం.సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పరుగులు తీస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో  మానవ జీవితం అత్యంత సౌకర్యవంతంగా మారింది.ఇదే సందర్భంలో నిర్మా ణాత్మక మైన పాత్ర పోషించవలసిన సాంకేతిక రంగం విలువల క్షీణతకు దారి చూపిస్తున్నది. మంచి కోసం వినియోగి ంచవలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడు ఆలోచనలకు, అపరిమితమైన స్వేచ్ఛకు అడ్డాగా మార్చడం అనైతికం. మనకున్న  స్వేచ్ఛను  టెక్నాలజీ ఆధారంగా దుర్వినియోగం చేయడం ఆందోళనకరం. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత మనిషి విధించుకున్న విలువలను అనేక కట్టుబాట్లను తుంగలో తొక్కుతున్నది. మంచి కంటే చెడుకి ఆకర్షణ ఎక్కువ. నేటి యువతరం తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని స్వార్ధ ప్రయోజనాలకోసం,  ఇతరులను హింసించడం కోసం,అశ్లీలత కోసం  దుర్వినియోగ పరచడం క్షంతవ్యం కాదు. మానవ మేథస్సు మానవాళిని నైతిక పతనం వైపు దిగజార్చడం సబబు కాదు. సాంకేతిక విప్లవం విజ్ఞానాన్ని పెంపొందిస్తున్న మాట వాస్తవం. గతంలో మనకు ఏ చిన్నసలహా కావాలన్నా ఇతరులమీద ఆధారపడేవారం.మన అనుమానాలను నివృత్తి చేసే వారికోసం పడే అన్వేషణలో అష్టకష్టాలు పడేవారం. ఇప్పుడా పరిస్థితి లేదు. క్షణాల్లో మన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు’’అంతర్జాలం’’ఒక అద్భుతమైన మంత్రదండంలా  మనముందు ప్రత్యక్షమౌతున్నది…………….(‌మిగతా…రేపటి సంచికలో)

image.png

 ‌సుంకవల్లి సత్తిరాజు
సంగాయగూడెం,దేవరపల్లి మండలం,తూ.గో జిల్లా.(ఆం.ప్ర)
9704903463

Leave a Reply