Take a fresh look at your lifestyle.

ముప్పై ఏళ్ల తర్వాత కూడా.. అగమ్యగోచరంగా కాశ్మీరీ పండిట్ల పరిస్థితి

Kashmiri pandiths, the wire, indian govt

“కాశ్మీరీ పండిట్లలో  మానసిక స్థయిర్యాన్ని కలిగించాలి. వారు భయంతో విలవిలాడుతున్నారు. కేవలం పోలీసులు, భద్రతా దళాల రక్షణ కాకుండా స్థానికులు కూడా ఆదరణగా, ప్రేమగా పలకరించి అక్కున చేర్చుకోవాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. కాశ్మీరీ పండిట్లు ఇప్పటికీ నాలుగు రోడ్ల కూడలి వద్దే ఉన్నారు. కాశ్మీరీ పండిట్లకు హుందాగా, గౌరవ ప్రదంగా జీవించే వాతావరణం కావాలని కాశ్మీరీ పండిట్లు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.”

కాశ్మీరీ పండిట్ల సంస్క•తి, సంప్రదాయాలు  భిన్నమైనవి. మూడు దశాలుగా  పుట్టిన గడ్డను వదిలిన వారు  ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నా తమ భిన్నత్వాన్ని వారు కాపాడుకుంటున్నారు. స్వదేశంలోనే ప్రవాసులుగా నివసిస్తున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా కాశ్మీరీ పండిట్ల జీవన ప్రమాణాల్లో   ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. కాశ్మీరీ పండిట్లకు సంబంధించిన ప్రశ్నలన్నీ శేషప్రశ్నలే. అయితే, రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనం కోసం వారిని గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. కాశ్మీర్‌లో ఇటీవల సంభవించిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా, 370 రద్దు తర్వాత    నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విదేశాలకూ, స్వదేశంలోని వివిధ ప్రాంతాలకూ తరలి వెళ్ళిన కాశ్మీరీ పండిట్లంతా స్వస్థలాలకు రావాలని అనుకుంటున్నారు.

నేను 30 ఏళ్ళ క్రితం భార్యా బిడ్డలతో స్వస్థలం వదిలి వెళ్ళాను. కొద్ది విరామం కోసమేమోనని అనుకున్నాను,  కానీ  దశాబ్దాలుగా ఢిల్లీలోనే ఉండి పోవల్సి వచ్చింది. ఇప్పుడు మాకు  పండిట్‌ ‌వలసదారులన్న పేరు వచ్చింది. 30వ వార్షికోత్సవం సందర్భంగా మూడు ప్రశ్నలు వేయదల్చుకున్నాను. కాశ్మీరీ పండిట్ల గౌరవ ప్రతిపత్తి గురించి మొదటి ప్రశ్న. పండిట్లు తమ విలక్షణమైన వర్గీయులను గుర్తించడం ఎలా? స్వస్థలాలకు తిరిగి వస్తే కాశ్మీరీల భవిష్యత్‌ ఎలా ఉంటుంది. 1990వ దశకంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన తమ వారి కుటుంబాలకు ఇంతవరకూ న్యాయం జరగలేదు, దీనికి ఎవరిని అడగాలి, స్వస్థలాలకు తిరిగి వెళ్తే  భద్రత ఉంటుందా? వృత్తులు, పనులు మామూలుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా?

మేం న్యాయం కోరుతున్నాం..
1989లో వేలాది మంది కాశ్మీర్‌ను వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఉగ్రవాదుల దాడుల్లో ఎంత మంది చనిపోయారో మా వద్ద ఖచ్చితమైన  గణాంకాలు లేవు. కొన్ని ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే దాఖలైనాయి, కొద్ది మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. 215 కేసులను తిరిగి విచారణకు ఆదేశించాలన్న పిటిషన్‌ను 2017లో సుప్రీమ్‌కోర్టు తిరస్కరించింది. 700 హత్యలకు సంబంధించిన కేసులపై విచారణ అంతంత మాత్రంగా జరిగింది. దాడుల్లో మరణించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారు. భారత ప్రభుత్వానికీ దేశ ప్రజలకూ పండిట్ల మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ  హత్యలపై న్యాయవిచారణ కోసం ఎందుకు డిమాండ్‌ ‌చేయలేదు. ఇందుకు బదులుగా కుట్ర కథనాలు ప్రచారం చేస్తున్నారు. కాశ్మీరీ పండిట్లు చట్టానికి కట్టుబడే  నియమ, నిబద్ధత గలవారు. కాశ్మీరీ పండిట్లపై దాడులపై విచారణ జరిగినా అది పారదర్శకంగా ఉండటం లేదు. అసలు ఎవరు ఎవరిని చంపారో తెలుసుకోవడం కష్టంగా ఉంటోంది. కాశ్మీరీ పండిట్లను ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోతోంది. కాశ్మీరీ పండిట్లను స్వస్థలాలకు పంపిస్తామని  పార్టీలతో తేడా లేకుండా నాయకులంతా  హామీలిస్తుంటారు. నాజీ జర్మనీ  తర్వాత  తరానికి  చెందిన  రాజకీయ సైద్ధాంత కర్త హన్నత్‌ ఆర్నెండ్‌ ‌చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి.  ‘ఎవరూ దోషులు కారు, ఎవరూ తప్పులు చేయలేదు’ అన్న ఆయన మాటలు గుర్తొస్తున్నాయి.  కాశ్మీర్‌లో జరిగిన, ఇప్పటికీ జరుగుతున్న సంఘటనలకు ఎవరు బాధ్యులు, హింసను ఎవరు సృష్టిస్తున్నారు. 1990 నుంచి వరుసగా జరుగుతున్న సంఘటనల్లో ఊహించలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. చర్యకు, ప్రతి చర్య మాదిరిగా అన్నీ జరిగి పోతున్నాయి. ఇది ఒక విష చక్రంలా తయారైంది.

2004లో 14 ఏళ్ళలో మొదటి సారిగా నేను కాశ్మీర్‌ ‌సందర్శించాను. అక్కడ కొందరు పిల్లలు క్రికెట్‌ ఆడుకుంటూ కేకలు వేస్తున్నారు. చాలా కాలం తర్వాత అక్కడ నా మాతృభాష వినిపించినందుకు ఎంతో ఆనందం కలిగింది. అందునా బహిరంగ ప్రదేశంలో పిల్లలు మాతృభాష మాట్లాడటం  విని ఎంతో పొంగిపోయాను. ఇళ్ళల్లోనే కాదు, బయట కూడా ఇంకా పండిట్ల భాషను మాట్లాడుకుంటున్నారన్న మాట అని అనిపించింది.  1990 నుంచి అక్కడ మా మాతృభాష వినిపించడం లేదు. మరాఠీ, తమిళం, అస్సామీ వంటి భాషలు ఎక్కువగా వినిపిస్తూండేవి. కాశ్మీరీ పండిట్ల భాషలో ఎంతో అందం ఉంది.   గత ఆగస్టులో కేంద్రం  రాజ్యాంగంలోని  35-ఏ అధికరణాన్ని రద్దు చేసే వరకూ స్థానికులకు ఎటువంటి హక్కులు, అనుభూతులు లేవు. కాశ్మీరీ భాషకు ఎంతో ఉన్నతమైన, విలక్షణమైన స్థానం ఉంది. దేశంలోని ఏ భాషకూ తీసిపోనిది.  కాశ్మీరీల సంస్కృతి ఎంతో గొప్పది, మతాలతో నిమిత్తం లేకుండా చెబుతున్న మాట ఇది.

2015లో నా తల్లి, నేను శ్రీనగర్‌ ‌తిరిగి వచ్చాం. ఇరవైఐదేళ్ళ తర్వాత తొలిసారిగా మేం గతంలో నివసించిన ప్రాంతంలో పాత  మిత్రులు ఎవరైనా కనిపిస్తారేమోనని నా తల్లిగారు ప్రయత్నించారు. ఈలోగా నా తల్లి పక్క వారితో మాట కలిపింది. వాళ్ళ కథనాలు వింటుంటే హృదయం ద్రవించింది. ఏ విధంగా వారు  దాడులకూ, మనస్తాపానికి గురి అయ్యారో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. ప్రాంతాలు వేరైనా కాశ్మీరీ పండిట్లందరిదీ ఒకే కథ, ఒకే వేదన.
కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలకు వచ్చేందుకు వారికి సంపూర్ణ హక్కులున్నాయని బీజేపీ, కాంగ్రెస్‌, ‌పీడీపీ, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్  ‌వగైరా అన్ని పార్టీల వారూ అంగీకరిస్తున్నారు. ‘మాకూ రావాలనే ఉంది, కానీ ఏ ప్రతిపత్తి మీద. మాకు పూర్వపు గౌరవ మర్యాదలు ఉంటాయా, మా ప్రాణాలకు భద్రత ఉంటుందా?’ అన్న  సందేహాలు కలుగుతున్నాయి. మాకు పూర్తి ప్రజాస్వామిక, మానవ హక్కులు ఉన్నాయి. వాటిని పరిరక్షించేవారేరీ? కాశ్మీరీ పండిట్లలో  మానసిక స్థయిర్యాన్ని కలిగించాలి. వారు భయంతో విలవిలాడుతున్నారు. కేవలం పోలీసులు, భద్రతా దళాల రక్షణ కాకుండా స్థానికులు కూడా ఆదరణగా, ప్రేమగా పలకరించి అక్కున చేర్చుకోవాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. కాశ్మీరీ పండిట్లు ఇప్పటికీ నాలుగు రోడ్ల కూడలి వద్దే ఉన్నారు. కాశ్మీరీ పండిట్లకు హుందాగా, గౌరవ ప్రదంగా జీవించే వాతావరణం కావాలని కాశ్మీరీ పండిట్లు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.

– ‘‌ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Tags: Kashmiri pandiths, the wire, indian govt

Leave A Reply

Your email address will not be published.