విశాఖ ఉక్కుపై ప్రయివేటు
ఉక్కుపాదం నీలినీడలు
క్రమ్ముకొంటున్నాయి..
లాభనష్టాల భేరీజు తారాజుకి
నష్టాల మొగ్గు మోళీచూపి
మసిపూసి మారేడుకాయను
చేసి.. ప్రయివేటు వేటు
వేసేందుకు మెడకాయను
సవరతీస్తున్నారు..
బలిదానాలతో సాధించుకొన్న
‘నవరత్న’ హోదాను బలిపీఠం
ఎక్కించేందుకు సర్వత్రా
రంగం సిద్ధమవుతోంది!
ఆంధ్రుల ఐక్యత ఉక్కులా
గట్టి పడాల్సిన సమయం
వచ్చింది!
పార్టీలు చుట్టచుట్టి పక్కన
పడేసి నాయకులంతా
ఉక్కుసంకల్పంతో
ఉద్యమించాల్సి ఉంది
తెన్నేటి విశ్వనాథం కల
ఆంధ్రుల తలమానికమంటి సంస్థ
తెలుగు జాతి పౌరుషాన్ని
నిలిపిన ఘర్మజలాంబుధి..
భూమిని త్యాగం చేసిన
నిర్వాసితుల త్యాగఫలం..
కల్లలా కరిగి పోకూడదు
ఆంధ్రజాతి కీర్తికిరీటంలో ఈ
నవరత్నం మకుటాయ మానమై
చిరస్తాయిగా మెరవాలి!!
– భీమవరపు పురుషోత్తం
9949800253