Take a fresh look at your lifestyle.

గోల్కొండపై కాషాయాలు, కషాయాలు ఉండవు

  • కెసిఆర్‌ ఇప్పటికే జాతీయ జెండా ఎగరేశారు
  • అభివృద్ది కావాలో…విద్వేషం కావాలో తేల్చుకోండి
  • వి•ట్‌ద ప్రెస్‌లో మంత్రి కెటిఆర్‌

‌పసనిచేస్తున్న టిఆర్‌ఎస్‌ను మరోమారు గెలిపించడం ద్వారా హైదరాబాద్‌ అభివృద్ధికి చేయూత నివ్వాలని మంత్రి కెటిఆర్‌ ‌పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను గత ఆరేళ్లలో అనేక రంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. తాము అభివృద్ధి చేసామని నమ్మితే వోటేయాలని, లేకుంటే శిక్షించండని కెటిఆర్‌ అన్నారు. అభివృద్ధి కావాలా..విద్వేషం కావాలో తేల్చుకోవాలన్నారు. అయితే అన్ని రంగాల్లో అభివృద్ధికి కట్టుబడ్డ తమను ప్రజలు ఆదరిస్తారని, గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేస్తున్నామని, ఎంఐఎంతో పొత్తుగానీ..ఆ పార్టీకి మేయర్‌ ‌పదవి అప్పగించడం కానీ జరగదన్నారు. అలాగే హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ ‌దెబ్బతీసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.

హైదరాబాల్‌లో ఎవరైన మతకల్లోలాలు సృష్టిస్తే ఊరుకునేది లేదని పరోక్షగా బిజెపిని హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన వి•ట్‌ ‌ద ప్రెస్‌ ‌వి•ట్‌లో కెటిఆర్‌ ‌మాట్లాడారు. బీజేపీ గెలిస్తే గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలపై ఓ విలేఖరి మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించగా..స్పందించిన ఆయన మాట్లాడుతూ మేమైతే బల్దియా వి•ద గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. గోల్కొండ వి•ద ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ‌జాతీయ జెండా ఎగురవేశారని, ఆ విషయం బండి సంజయ్‌కు తెలియనట్టుందని అన్నారు. గోల్కొండపై కాషాయాలు, కషాయాలు ఉండవన్నారు. ఇప్పుడు బండి సంజయ్‌ ‌కొత్తగా చేసేదేవి•లేదన్నారు.

Leave a Reply