Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో సర్కార్‌ ‌విఫలం

  • ప్రజల ఆవేదనను  పట్టించుకోవడం లేదు
  • మరోమారు మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి
  • కొరోనా కట్టడిలో కెసిఆర్‌ ‌విఫలం: లక్ష్మణ్‌

కొరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. వైరస్‌తో మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసింది కాబట్టే.. కొరోనా కట్టడికి గవర్నర్‌ ‌జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దేశంలో ఎక్కడా గవర్నర్‌ ‌హాస్పిటళ్లను పరిశీలించిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. గవర్నర్‌ ‌స్వయంగా రంగంలోకి దిగి హాస్పిటళ్లను పరిశీలించారని, ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల యాజమాన్యాలతో చర్చించారని అన్నారు. కొరోనా కట్టడికి కేంద్రం కూడా ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. ఆస్పత్రుల్లో బెడ్స్ ‌లేక కొరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో చేసినన్ని కొరోనా టెస్టులు తెలంగాణలో చేయటంలేదని విమర్శించారు. తీరా ప్రశ్నిస్తే ఐసీఎంఆర్‌ ‌గైడ్‌ ‌లెన్స్ ‌పేరుతో మంత్రులు ఎదురుదాడి చేయటం దారుణం అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే ప్రజలు సమస్యల పరిష్కారం కోసం రాజ్‌భవన్‌ ‌బాట పట్టారని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఏ మేరకు సాయం అందిందీ కేంద్రంమంత్రి కిషన్‌ ‌రెడ్డి వివరించారని అన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో దారుణాలపై ప్రజలు ఆవేదనగా వీడియోలు విడుదల చేస్తున్నా పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ అన్నారు.

నేరాలు తగ్గాయనడం అవాస్తవమన్న రాజాసింగ్‌ ‌నగరంలో నేరాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్‌ ‌విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం డియాతో మాట్లాడుతూ నగరంలో ఈ ఆరు నెలల్లో క్రై ‌రేట్‌ ‌తగ్గింది అని పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌ ‌చేసిన ప్రకటన సత్యదూరం అన్నారు. ఇటీవలే వరుసగా ఐదారు హత్యలు నమోదయిన విషయాన్ని రాజాసింగ్‌ ‌ప్రస్తావించారు. సిపి అంజనీకుమార్‌కు గుర్తు చేస్తున్న.. 20 రోజుల్లోపే 6 హత్యలు జరిగాయి. చోరీలు, హత్యలు, అత్యాచారాలు ఎన్ని జరిగాయో వారే చెప్పాలని రాజాసింగ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ క్రై ‌రేట్‌ ‌తగ్గినట్లు ప్రకటనలు పోలీస్‌ ‌కమిషనర్‌ ఇస్తున్నారా? ఫామ్‌ ‌హౌస్‌లో కూర్చొని క్రైమ్‌ ‌తగ్గినట్లు చెప్పమని పెద్దలు ఆదేశిస్తున్నారా ? అర్థం కావడం లేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌వ్యాఖ్యానించారు. నగరంలో శాంతిభద్రతలు బాగున్నాయని ఎలా అనగలరని ప్రశ్నించారు.

కొరోనా కట్టడిలో కెసిఆర్‌ ‌విఫలం : లక్ష్మణ్‌
‌రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని భాజపా నాయకుడు లక్ష్మణ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో కెసిఆర్‌ ‌విఫలం: లక్ష్మణ్‌రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని భాజపా నాయకుడు లక్ష్మణ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తి విషయమై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందన్నారు. కేసులు పెరుగుతున్నా అందుకు తగ్గట్లుగా చర్యలు లేవన్నారు. కరోనా కట్టడికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా, రాష్ట్రానికి ఎన్ని రకాల సహాయాలు అందించినా… కేంద్రంపై తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెక్షన్‌ 8‌పై గవర్నర్‌ ‌జోక్యం చేసుకున్నారు. సెక్రెటరీయేట్‌ ‌కూల్చివేత నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో ఇప్పుడు సచివాలయం కూల్చాలా అని అన్నారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి విషయమై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందన్నారు. కేసులు పెరుగుతున్నా అందుకు తగ్గట్లుగా చర్యలు లేవన్నారు. కొరోనా కట్టడికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా, రాష్ట్రానికి ఎన్ని రకాల సహాయాలు అందించినా…కేంద్రంపై తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెక్షన్‌ 8‌పై గవర్నర్‌ ‌జోక్యం చేసుకున్నారు. సెక్రెటరీయేట్‌ ‌కూల్చివేత నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో ఇప్పుడు సచివాలయం కూల్చాలా అని అన్నారు.

Leave a Reply