Take a fresh look at your lifestyle.

దుబ్బాక దెబ్బకు టిఆర్‌ఎస్‌కు మత్తు వదలాలి

  • గ్రేటర్‌లోనూ సత్తా చాటుతాం : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి
  • గిరిజనలకు12 శాతం రిజర్వేషన్ల హావి•ని కెసిఆర్‌ ‌తుంగలో తొక్కారు : బండి సంజయ్‌  

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌ప్రజలకు అబద్దాలు చెప్పడంలో తండ్రీ, కొడుకులు పోటీపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. కేంద్రం నిధులపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీవి తప్పుడు లెక్కలని దుబ్బాక ప్రజలు నిరూపించారని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అడ్డా దుబ్బాకను బద్దలు కొట్టామని అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు కూడా అబద్ధాలు ప్రచారం చేయడంలో దిట్టని కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు.. అవాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారన్నారు. అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేశారన్నారు.  బుధవారం కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్‌ఎస్‌ ‌కంచుకోటను బద్దలుకొట్టి బీజేపీని గెలిపించారన్నారు. హైదరాబాద్‌లో పేదలకు లక్ష  ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆరేళ్లు అయినా ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు.

గిరిజనలకు12 శాతం రిజర్వేషన్ల హావి•ని కెసిఆర్‌ ‌తుంగలో తొక్కారు : బండి సంజయ్‌  
‌గిరిజనులను కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. గిరిజనలకు 12శాతం రిజర్వేషన్ల హావి•ని తుంగలో తొక్కారని అన్నారు. వారికోసం బిజెపి పోరాడుతుందని అన్నారు. పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడిగా హుస్సేన్‌ ‌నాయక్‌ ‌ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా బండి మాట్లాడారు. లాక్‌డౌన్‌ ఉన్నా..మోదీ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్నారు. కేంద్ర ప్యాకేజీ తప్ప..కేసీఆర్‌ ‌ప్రజలకు చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌ ‌గతంలో పాస్‌పోర్ట్ ‌బ్రోకర్‌ అని విమర్శించారు.  బీసీలపై ప్రేమ ఉంటే టీఆర్‌ఎస్‌కు బీసీని అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్‌ ‌చేశారు. నిజామాబాద్‌లో కేసీఆర్‌ ‌బిడ్డను..దుబ్బాకలో అల్లుడిని ఓడించామని చెప్పారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో కేసీఆర్‌ ‌బాక్స్ ‌బద్దలు కొడతామని బండి సంజయ్‌ ‌హెచ్చరించారు.

Leave a Reply