Take a fresh look at your lifestyle.

ప్రపంచ మార్పులకు అనుగుణంగా.. సీబీఎస్‌ఈ ‌సిలబస్‌లో మార్పులు..!

  • తొలగించిన సమాఖ్య, పౌరసత్వం, జాతీయవాదం, లౌకిక వాదం
  • విద్యార్థుల పై ఒత్తిడి తగ్గుతుందన్న కేంద్ర మంత్రి రమేష్‌ ‌పోక్రియల్‌
  • ‌సిలబస్‌లో కీలకాంశాల తొలగింపు కేంద్రం చర్యలపై విపక్షాల అభ్యంతరం

కొరోనా వైరస్‌ ‌యుగంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌మిషన్‌ ‌హిందూ రాష్ట్ర సాధనకి ఏర్పాట్ల వేగం కేంద్రం పెంచింది. భారత రాజ్యాంగం పొతే కానీ హిందూ రాష్ట్ర సాధన సంపూర్తి కాదు. భారత రాజ్యాంగం అవసరం లేదు అనే పౌరులను తయారు చేయటానికి ఇంతవరకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ ఇం‌తవరకు సొంత స్కూల్స్ ‌నడిపేది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ స్కూళ్లను రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ ‌స్కూల్స్ ‌గా మార్చటానికి కేంద్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో వచ్చింది. కొరోనావైరస్‌ ‌మహమ్మారి వల్ల కలుగుతున్న విద్య షెడ్యూల్‌ అం‌తరాయం దృష్ట్యా 2020-21 విద్యా సంవత్సరానికి తొమ్మిదో తరగతి నుంచి 12 వ తరగతి వరకు సీబీఎస్‌ఇ ‌సిలబస్‌ను 30% వరకు తగ్గించడానికి సెంట్రల్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకునేలాగా కేంద్ర మానవ వనురుల శాఖ సీబీఎస్‌ఇకి ఆదేశాలు జారీ చేసింది. కొత్త సిలబస్‌ ‌ప్రకారం పాఠ్యాంశాలలో 10వ తరగతి సిలబస్‌ ‌నుండి తొలగించబడిన అధ్యాయాలలో ప్రజాస్వామ్య, దేశ వైవిధ్యం, లింగ, మత, కుల, వంటి విషయాలు చర్చించే పాఠ్యాంశాలను తొలగించారు.వీటితోపాటు ప్రజాపోరాటాలు..ఉద్యమ చరిత్రలు..ప్రజాస్వామ్యానికి సవాళ్లు వంటి అవగాహనా పాఠ్యాంశాలను కూడా తొలగించారు.11వ తరగతిలో తొలగించబడినభాగాలలో సమాఖ్య, పౌరసత్వం, జాతీయవాదం,లౌకికవాదం అంశాలు వున్నాయి.. అదేవిధంగా 12వ తరగతి విద్యార్థులు ఇకపై పొరుగు దేశాలతో సంబంధాలు..భారత ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల వలన భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక ఉద్యమాలు.. నోట్ల రద్దు.. వంటి పాఠ్యాంశాలు చదవనక్కర లేదు.

కొరోనా వైరస్‌ ‌మహమ్మారి నెపంతో సెంట్రల్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌బోర్డు దేశ పౌరులకు ఎంతో అవసరమైన పాఠ్యాంశాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ ‌పోక్రియాల్‌ ‌ట్వీట్‌ ‌చేసి ప్రకటించారు. ప్రస్తుతం కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని.. ఆ మార్పులకు అనుగుణంగా సీబీఎస్‌ఇ ‌తన సిలబస్‌ ‌ను తగ్గించటం ద్వారా విద్యార్థుల పైన ఒత్తిడి తగ్గిస్తుందని మంత్రి సెలవిచ్చారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలామంది విద్యా వేత్తల సలహాలు తీసుకున్నామని వారు ఇచ్చిన సలహాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి రమేష్‌ ‌పోక్రియాల్‌ ‌చెప్పారు.

సిలబస్‌లో కీలకాంశాల తొలగింపు:
సిలబస్‌ ‌తగ్గింపులో భాగంగా ప్రజాస్వామ్య హక్కులు, సమాఖ్య విధానం, లౌకికవాదం వంటి కీలక అంశాల్ని పాఠ్యాంశాల నుంచి తొలగించడం తనను షాక్‌ ‌గురిచేసిందని పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమైన అంశాల్ని సిలబస్‌ ‌నుంచి తొలగించుకుండా చూడాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను కోరారు. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, తిరునంతపురం ఎంపీ శశి థరూర్‌ ‌సైతం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిలబస్‌ ‌నుంచి కీలకాంశాల్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్న వారి ఉద్దేశాల్ని శంకించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం, వైవిధ్యత, లౌకికవాదం వంటి అంశాలు భవిష్యత్‌ ‌తరాలకు అందించాల్సిన అంశాలు కాదని భావించారా? అని ట్విటర్‌ ‌వేదికంగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన మరో నేత జైరాం రమేశ్‌ ‌మాట్లాడుతూ.. మొత్తం రాజనీతి శాస్త్రంపైనే డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనుకుంటున్న ఓ వ్యక్తి నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం అని పరోక్షంగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కొరోనా కారణంగా పాఠశాలలు నడవని పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే.
విద్యార్థుల అభ్యాస లక్ష్యాల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన అంశాలను యథాతథంగా ఉంచుతూనే 9-12 తరగతుల సిలబస్‌ను 30శాతం వరకు హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ ‌పోఖ్రియాల్‌ ‌మంగళవారం వెల్లడించారు.

ఒత్తిడి తగ్గించేందుకే సిలబస్‌ ‌తగ్గింపు : కేంద్ర మంత్రి పోఖ్రియాల్‌
‌సెక్యులరిజం, పౌరసత్వం లాంటి టాపిక్స్‌ను సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ ‌నుంచి తొలగించిన విషయంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ ‌పోక్రియాల్‌ ‌నిషాంక్‌ ‌స్పందించారు. చిన్నారులకు విద్యను అందించడం మన పవిత్ర కర్తవ్యమని, విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, మన రాజకీయాలను మరింత చైతన్యవంతం చేయాలని మంత్రి తెలిపారు. తన ట్విట్టర్‌ ‌ద్వారా సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ అం‌శంపై రియాక్ట్ అవుతూ.. బయోలజీ, మ్యాథమటిక్స్, ఎకనామిక్స్ ‌పాఠ్యాంశాల్లోనూ కొంత సిలబస్‌ను తొలగించినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులపై వత్తిడిని తగ్గించేందుకే.. 30 శాతం సిలబస్‌ను తీసివేసినట్లు మంత్రి తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!