ప్రమోట్ చేయడం కుదరదు: సుప్రీమ్‌కోర్టు
ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్షలు రాయకుండా ఎవరినీ ప్రమోట్ చేయడానికి వీల్లేదని సుప్రీమ్‌కోర్టు సూచించింది. సెప్టెంబర్ 30లోపు ఫైనలియర్ పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని యూజీసీని ఆదేశించింది. యూజీసీ గైడ్‌లైన్స్‌ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాల్సిందేనని వెల్లడించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేయవచ్చని తెలిపింది. కొరోనా మహమ్మారి నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఈ పరీక్షలను వాయిదా వేయవచ్చని వెల్లడించింది. కొరోనా నేపథ్యంలో ఫైనలియర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌చేయాలని దాఖలైన పిటిషన్లను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
పరీక్షలు నిర్వహించకుండా ఇంటర్నల్ అసెస్మెంట్ లేదా గంతో నిర్వహించిన పరీక్షల ఆధారంగా విద్యార్థులను పై తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒకవేళ సెప్టెంబర్ 30 తర్వాత పరీక్షలు నిర్వహించాలనుకుంటే రాష్ట్రప్రభుత్వాలు యూజీసీని సంప్రదించాలని సూచించింది.