Take a fresh look at your lifestyle.

ఆగని బియ్యం, బెల్లం దందా

Smugling rice and jaggery

  • మండలంలో జోరుగా రవాణా – అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు గుసగుసలు
  • పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటున్న బియ్యం బెల్లం డాన్లు

మండలంలో జోరుగా బియ్యం బెల్లం దందాలు నడుస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు కిలో రూపాయి బియ్యం రేషన్‌ ‌ద్వారా అందిస్తుం ది పేద ప్రజల నోటికాడి బియ్యాన్ని కిలోకు అయిదు రూపాయల లెక్క కొని అదె బియ్యాన్ని కిలోకు ముప్పై అయిదు నుంచి ముప్పై ఎనిమిది రూపాయల దాకా అమ్ముకుని కోట్లు గడిస్తున్నారు .బియ్యం దందాలు రాత్రివేళల్లోనే ఎక్కువగా జరు గుతున్నట్లు సమాచారం రాత్రి వేళల్లో గ్రామాల్లో ని వ్యాపారస్తులు ఆటోలలో బైకులపై మూటలు గా కట్టుకుని ఆటోలో వేసుకుని వస్తారు ఊరు చివర్లలో వెసులుబాటు వున్న చోట లారీని ఆపి అటొ లొఉన్న బియ్యంను లారీల్లో వేసి అప్పటికే అక్కడ ఉన్న పది నుంచి పది ఇరవై మంది హ మాలీలు చకచకా గంటల్లోపే లొ•డు అయిపోయి నట్టు ఏర్పాట్లు చేస్తారు ఎవరన్నా లొడు జరిగె సరిహద్దుల్లో కెళితే వారిని చంపటానికి కూడా వెనకాడరు .గత ఎనిమిది తొమ్మిది మాసాల నుంచి మండలంలో నిశ్శబ్దంగా స్తబ్దుగా ఉన్న బియ్యం. బెల్లం. రవాణా దందా మళ్లీ ఇరవై రోజుల నుంచి ఆగకుండా రోజుకు రెండు మూడు లారీల బియ్యం రవాణా అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి .పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇలాంటి రవాణాను దందాను ఆపటం కొరకు ఎంత ప్రయత్నించినా వారి కళ్లుగప్పి దందా యథేచ్ఛగా నడిపిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు బియ్యం వ్యాపారులకు సహకరిస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. లబ్ధిదారులు దగ్గర్నుంచే కాకుండా రేషన్‌ ‌షాపుల్లో నుంచే ఎక్కువ మొత్తంలో బియ్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం . ఐదు రూపాయలకు కొన్న బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి ఆంధ్ర రాష్ట్రంలోని కాకినాడ పోర్టుకు తరలి తరలించి అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్న ట్లు అధికారుల దగ్గర సమాచారం .పోలీసులు వ్యాపారస్తులపై ఎన్ని కేసులు పెట్టిన పీడీ యాక్ట్లు పెట్టినా కూడా బియ్యం దందా బెల్లం దందా ఆగకుండానే రవాణా జరుగుతుంది. ఎక్కువగా సీరోలు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని జరుగుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఈ ప్రాంతాల్లోనే గుట్టలు అంతర్గత రహదారుల్లో ఉండటం వల్ల దందాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు .వ్యాపారస్థులు లారీలను తమ సరిహద్దు దాటించేందుకు లారీకి వెనుక ముందు ఎస్కార్ట్ ‌వాహనాలు ఏర్పాటు చేసుకుని సరిహద్దు లు దాటిస్తున్నారు ఇటీవల కాలంలో పోలీసులు ఎన్నిసార్లు పట్టుకున్నా కూడా వ్యాపారస్తులు ఇంకా రెచ్చిపోయి బెల్లం బియ్యం దందా చేస్తున్నారు. వ్యాపారస్తులు అనతి కాలంలోనే కోట్లు గడించి బడా వ్యాపారస్తుల లిస్టులో ముందున్నారు వ్యాపారులపై కేసులు నమోదు కావడంతో వారి స్థానంలో బినామీలను పెట్టి ఒక వ్యక్తికి నెలకు లక్ష రూపాయల జీతం ఇచ్చి పెట్టుకుని ఎక్కడైనా పట్టుబడితే తమ పేర్లు వ్యాపార స్థావరాలు బయటకు రావొద్దని వారు సూచించడం జరుగుతుంది. మండలంలో వ్యా పారాలు చెసె వారు బినామీలను పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని ప్రజలు చర్చించుకొం టునారు. రెవెన్యూ అధికారులు పోలీసులు బయ ట జిల్లాల నుంచి వచ్చే బెల్లం బియ్యం లారీలను పట్టుకుంటున్నారని మహబూబాద్‌ ‌జిల్లా జిల్లాలోని కురవి నర్సింహులపేట నెల్లికుదురు మండలాల్లో ఎక్కువగా జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై పోలీసులు సరిగా స్పందించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు . అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యాపారాలు జరుగుతున్నట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు గట్టి నిఘా పెట్టి వ్యాపారాన్ని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ వ్యాపారులపై నిఘా: ఎస్‌ఐ
‌మండలంలో వివిధ రహదారుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నట్లు ఎస్సై జక్కుల శంకర్రావు తెలిపారు అక్రమంగా వ్యాపారం చేసే వారిపై అనుచరులపై కూడా నిఘా ఉంచినట్లు తెలిపారు ప్రజలు తమ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై మాకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు.

Leave a Reply